IPL 2024 PlayOffs: ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌ జట్లు.. ఈ కామన్‌ పాయింట్ గమనించారా?

PlayOffs Teams Names: ఐపీఎల్ 17వ సీజన్‌లో నాకౌట్‌ మ్యాచ్‌ల సందడి మొదలు కానుంది. దీనికి అర్హత సాధించిన నాలుగు జట్ల పేర్లు గురించి ఇప్పుడు చర్చ జరుగుతుంది. 

Published : 21 May 2024 14:11 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్‌ 2024 సీజన్‌ ప్లేఆఫ్స్‌కు చేరిన జట్లలో మీకేమైనా కామన్‌ పాయింట్‌ కనిపిస్తోందా? పూర్తి పేర్లు చూస్తే అలా అనిపించదు కానీ.. వాటి షార్ట్‌ నేమ్స్‌ చూస్తే మీకే అర్థమవుతుంది. కావాలంటే మీరే చూడండి..  కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (KKR), సన్‌రైజర్స్ హైదరాబాద్‌ (SRH), రాజస్థాన్‌ రాయల్స్ (RR), రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB) ఇలా నాలుగు జట్లలోనూ ‘R’ కామన్‌గా ఉంది. ఇక తెలుగులో చూస్తే ‘ఆర్‌’ కచ్చితంగా కనిపిస్తుంది. దీంతో 2024 ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌ ‘R’తో నిండిపోయింది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ప్లేఆఫ్స్‌ ఎలా సాగుతాయంటే?

  • కోల్‌కతా X హైదరాబాద్‌ జట్ల మధ్య అహ్మదాబాద్‌ వేదికగా ఇవాళ రాత్రి 7.30 గంటలకు మొదటి క్వాలిఫయర్‌ జరగనుంది.
  • ఎలిమినేటర్‌లో రాజస్థాన్‌ X బెంగళూరు మే 22న రాత్రి 7.30గంటలకు పోటీపడతాయి. ఇందులో గెలిచిన జట్టు రెండో క్వాలిఫయర్‌కు దూసుకెళ్తుంది. 
  • మే 24న రెండో క్వాలిఫయర్‌ జరగనుంది. తొలి క్వాలిఫయర్‌లో ఓడిన టీమ్‌.. ఎలిమినేటర్‌ విజేతతో తలపడుతుంది.
  • మే 26న ఫైనల్‌ ‘ఆర్‌’ వర్సెస్‌ ‘ఆర్‌’ జరుగుతుంది. చెన్నై వేదికగా ఆ పోరు ఉండనుంది. 
  • ఇక వర్షాలు పడుతున్నాయి కదా... అలా మరో  ‘R’ (Rain) కూడా పోటీకి సిద్ధంగా ఉంది. అందుకే వర్షం పడితే ఏమవుతుందో అనే చర్చ కూడా జరుగుతోంది.

వర్షం పడితే ప్లేఆఫ్స్‌ సమీకరణాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని