Archery World Cup: పసిడి పోరుకు జ్యోతి ద్వయం

కాంపౌండ్‌ మహిళల వ్యక్తిగత విభాగంలో నిరాశపరిచిన విజయవాడ ఆర్చర్‌ జ్యోతి సురేఖ టీమ్‌ విభాగాల్లో రెండు స్వర్ణాల కోసం పోటీలో నిలిచింది.

Published : 25 May 2024 03:47 IST

ఆర్చరీ ప్రపంచకప్‌

యెచియాన్‌: కాంపౌండ్‌ మహిళల వ్యక్తిగత విభాగంలో నిరాశపరిచిన విజయవాడ ఆర్చర్‌ జ్యోతి సురేఖ టీమ్‌ విభాగాల్లో రెండు స్వర్ణాల కోసం పోటీలో నిలిచింది. ఆర్చరీ ప్రపంచకప్‌ రెండో అంచె పోటీల్లో ఇప్పటికే మహిళల టీమ్‌లో తుదిపోరు చేరిన ఆమె.. తాజాగా మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలోనూ ఫైనల్‌ చేరింది. శుక్రవారం కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ సెమీస్‌లో జ్యోతి- ప్రియాన్ష్‌ జంట 158-157 తేడాతో సెంగ్‌యెన్‌- జేవాన్‌ (దక్షిణా కొరియా)పై పోరాడి గెలిచింది. శనివారం స్వర్ణ పతక పోరులో ప్రపంచ నంబర్‌వన్‌ ఒలీవియా- సాయర్‌ (అమెరికా)తో రెండో ర్యాంకర్‌ భారత్‌ జోడీ పోటీపడుతుంది. మరోవైపు మహిళల రికర్వ్‌లో ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ దీపిక సెమీస్‌లో అడుగుపెట్టింది. క్వార్టర్స్‌లో ఆమె 6-4తో గోకిర్‌ (టర్కీ)పై నెగ్గింది. రికర్వ్‌ విభాగంలో పతక వేటలో మిగిలింది దీపిక మాత్రమే. భజన్‌ కౌర్‌ తొలి రౌండ్లో, అంకిత రెండో రౌండ్లో ఓడిపోయారు. పురుషుల వ్యక్తిగత రికర్వ్‌లో తరుణ్‌దీప్‌ రాయ్, మృనాల్‌ చౌహాన్, బొమ్మదేవర ధీరజ్, ప్రవీణ్‌ జాదవ్‌ నిష్క్రమించారు. దీపిక- తరుణ్‌దీప్‌ జోడీ మిక్స్‌డ్‌ టీమ్‌ క్వార్టర్స్‌లో పరాజయం పాలైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని