Kavya Maran: ‘అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఆమె’.. నెట్టింట వైరల్‌గా మారిన కావ్యా మారన్‌

కావ్యా మారన్‌.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌ ఫ్రాంచైజీ యజమాని. ముంబయితో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ భారీ స్కోరు సాధించడంతో ఆమె ఒక్కసారిగా నెట్టింట వైరల్‌గా మారారు.

Updated : 28 Mar 2024 12:46 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్‌ 17వ సీజన్‌లో హైదరాబాద్‌ తొలి విజయాన్ని నమోదు చేసింది. ఉప్పల్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబయిని 31 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ ఐపీఎల్‌లోనే రికార్డు స్థాయి స్కోరును సాధించింది. ముగ్గురు బ్యాటర్లు హాఫ్‌ సెంచరీలు చేయడంతో 277/3 స్కోరు చేసింది. అంతకుముందు కోల్‌కతాపైనా 209 పరుగుల లక్ష్య ఛేదనలో 200+ పరుగులు వరకు వచ్చింది. దీంతో భారీ హిట్టింగ్‌తో హైదరాబాద్‌ పరుగులు పెడుతుండటంతో ఆ జట్టు యజమాని కావ్యా మారన్‌ (Kavya Maran) నెట్టింట వైరల్‌గా మారారు. ఉప్పల్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆమె నవ్వుతూ సంతోషంగా కనిపించింది. అభిషేక్ శర్మ, క్లాసెన్, ట్రావిస్‌ హెడ్ సిక్సర్లు బాదినప్పుడల్లా ఆనందంతో ఆమె చేసిన హవభావాలు నెటిజన్లను ఆకట్టుకున్నాయి. దీనిపై వారు చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇవీ..

‘‘ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ఆనందంగా ఉన్న మహిళ ఆమె’’

‘‘ముంబయిని హైదరాబాద్ ఉప్పల్‌లో ఓడించింది. కావ్యా మారన్ సంతోషానికి అవధుల్లేవు’’

‘‘ఈసారి కప్‌ను గెలిచి కావ్యా మారన్‌ కోసం అంకితం ఇవ్వాలి. గత కొన్ని సీజన్లలో హైదరాబాద్‌ ప్రదర్శన బాగోలేదు. ఈ సీజన్‌లో దూకుడు కనిపిస్తోంది’’

‘‘కంగ్రాట్స్ కావ్యా మారన్‌. ఈ సీజన్‌ మొత్తం మీరు ఇలానే నవ్వుతూ ఉండాలి. హైదరాబాద్ ఆటగాళ్లు అదరగొట్టేయాలి’’

‘‘ఇలాంటి అద్భుతం ఇంతకుముందెన్నడూ చూడలేదు. రెండు మ్యాచుల్లోనూ హైదరాబాద్‌ ఆటగాళ్లు అలవోకగా బ్యాటింగ్‌ చేసేశారు’’



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని