Saurabh Netravalkar: ‘హెచ్‌-1బీ వీసానే లేకపోతే యూఎస్‌ పనంతే’.. నేత్రావల్కర్‌పై మీమ్స్‌ సందడి

Saurabh Netravalkar: పాక్‌పై అమెరికా జట్టు విజయంలో కీలక భూమిక పోషించిన నేత్రావల్కర్‌పై నెట్టింట పొగడ్తల వర్షం కురుస్తోంది.

Published : 08 Jun 2024 00:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీ20 క్రికెట్ ప్రపంచకప్‌లో అనూహ్యంగా తెరపైకొచ్చిన పేరు సౌరభ్‌ నేత్రావల్కర్‌ (Saurabh Netravalkar). అమెరికా జట్టు తరఫున ఆడిన ఈ భారతీయ టెకీ.. తన పదునైన బౌలింగ్‌తో పాక్‌ను కట్టడి చేయడమే కాకుండా సూపర్‌ ఓవర్‌లో ఆ జట్టుకు షాకిచ్చాడు. ఒకప్పుడు అండర్‌-19కు భారత్‌ తరఫున ఆడిన యువకుడు.. ప్రస్తుతం అమెరికాలో ఒరాకిల్‌లో టెకీగా వ్యవహరిస్తూనే మరోవైపు క్రికెట్‌లో రాణిస్తున్నాడు. పాక్‌పై అమెరికా విజయం తర్వాత ప్రస్తుతం నెట్టింట అతడి పేరు మార్మోగిపోతోంది. అందులోనూ పాక్‌ను కంగుతినిపించిన సంతోషంలో పలువురు క్రికెట్‌ అభిమానులు మీమ్స్‌తో సందడి చేస్తున్నారు. 

పాక్‌కు ‘సూపర్‌’ షాకిచ్చిన ముంబయి ఇంజినీర్‌.. ఎవరీ సౌరభ్‌ నేత్రావల్కర్‌?

‘ఒకవేళ హెచ్‌-1బీ వీసానే లేకుంటే పాక్‌ను అమెరికా ఓడించి ఉండేది కాదు’ అంటూ ఓ నెటిజన్‌ సరదాగా కామెంట్‌ పెట్టాడు. ‘ఒరాకిల్‌లో ఉన్న నేత్రావల్కర్‌కు మైక్రోసాఫ్ట్‌లో ఆఫర్‌ ఇవ్వాలని తమ రిక్రూట్‌మెంట్‌ టీమ్‌కు సత్య నాదెళ్ల సూచించారు’ అంటూ ఓ వ్యక్తి సరదాగా రాసుకొచ్చారు. సౌరభ్‌ సెన్సేషన్‌ తర్వాత ప్రతి ఒక్క సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఇలా గర్వపడుతున్నారంటూ సరదా సరదా మీమ్స్‌తో సందడి చేస్తున్నారు. మరికొందరైతే అక్షయ్‌ అతడి బయోపిక్‌కు సిద్ధమయ్యాడంటూ పోస్టులు పెడుతున్నారు. మ్యూజిక్‌లోనూ అతడికి ప్రావీణ్యం ఉండడంతో ఆల్‌రౌండర్‌ అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అందులో కొన్ని ఫన్నీ పోస్టులు ఇవిగో..




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని