RCBW vs MIW: బెంగళూరు చిత్తు.. టాప్‌లోకి ముంబయి ఇండియన్స్‌

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరును చిత్తు చేస్తూ WPL 2024 పాయింట్ల పట్టికలో ముంబయి ఇండియన్స్‌ టాప్‌లోకి దూసుకెళ్లింది.

Updated : 02 Mar 2024 22:44 IST

బెంగళూరు: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరును చిత్తు చేస్తూ WPL 2024 పాయింట్ల పట్టికలో ముంబయి ఇండియన్స్‌ టాప్‌లోకి దూసుకెళ్లింది. తొలుత బంతి, ఆ తర్వాత బ్యాటుతో సత్తా చాటి.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బెంగళూరు నిర్దేశించిన 132 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి 15.1 ఓవర్లలోనే ఛేదించింది. బ్యాటింగ్‌లో యాస్తికా భాటియా (31), మ్యాథ్యూస్‌ (26),  నాట్ స్కివర్ (27), అమేలియా ఖేర్‌ (40*) రాణించారు. ఆర్సీబీ బౌలర్లలో సోఫి డెవిన్‌,  జార్జియా వేర్‌హామ్, శ్రేయాంకా పాటిల్‌ ఒక్కో వికెట్ తీశారు.

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 6 వికెట్ల నష్టానికి 131 పరుగులే చేసింది. ఓపెనర్లు కెప్టెన్‌ స్మృతి మంధాన (9), సోఫి డెవిన్‌ (9) విఫలమయ్యారు. ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచుల్లో రాణించిన తెలుగు అమ్మాయి సబ్బినేని మేఘన (11) ఈసారి పెద్దగా ఆడలేదు. వరుసగా వికెట్లు పడుతుండగా ఎలిస్‌ పేర్రి (44*) జట్టును ఆదుకుంది. జార్జియా వేర్‌హామ్ (27) ఫర్వాలేదనిపించింది. ముంబయి బౌలర్లలో నాట్ స్కివర్, పూజా వస్త్రాకర్ చెరో రెండు.. ఇస్సీ వాంగ్,  సైకా ఇషాక్ ఒక్కో వికెట్‌ తీశారు. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచుల్లో ముంబయి మూడింటిలో నెగ్గి 6 పాయింట్లతో టాప్‌లో కొనసాగుతోంది. ఆ తర్వాతి స్థానాల్లో దిల్లీ (4), యూపీ (4), బెంగళూరు (4), గుజరాత్‌ (0) ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని