Mitchell Starc: పాతిక కోట్లు డ్రైనేజీలో పోసినట్లేనా..? మిచెల్‌ స్టార్క్‌పై మీమ్స్‌ వైరల్!

కోల్‌కతా జట్టులో అత్యంత విలువైన ఆటగాడు తొలి మ్యాచ్‌లోనే తేలిపోయాడు. దీంతో క్రికెట్ అభిమానులు తమ కామెంట్లకు పదును పెట్టారు.

Updated : 24 Mar 2024 12:22 IST

ఇంటర్నెట్ డెస్క్: గత మినీ వేలంలో రూ. 24.75 కోట్లు పెట్టి మిచెల్ స్టార్క్‌ను కోల్‌కతా దక్కించుకుంది. హైదరాబాద్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన స్టార్‌ వికెట్‌ లేకుండా 53 పరుగులు ఇచ్చాడు. హైదరాబాద్‌పై కోల్‌కతా స్వల్ప తేడాతో గట్టెక్కినా స్టార్క్‌ ప్రదర్శనపై నెట్టింట విమర్శలు వచ్చాయి. మీమ్స్‌తో సోషల్‌ మీడియాలో నెటిజన్లు చెలరేగిపోయారు. దాదాపు పాతిక కోట్లు డ్రైనేజీలో పోసినట్లేందని కామెంట్లు చేశారు. స్టార్క్‌ కోసం కోల్‌కతా, గుజరాత్ టైటాన్స్‌ హోరాహోరీగా మినీ వేలంలో బిడ్డింగ్‌లు వేశాయి. చివరికి కోల్‌కతా భారీ మొత్తం వెచ్చించి సొంతం చేసుకుంది. ఈ లీగ్‌లో తమ జట్టుకు స్టార్క్‌ కీలకమవుతాడని మెంటార్ గౌతమ్‌ గంభీర్‌ అన్నాడు. తీరా, ఇప్పుడు ఈ మ్యాచ్‌లో విఫలం కావడం గమనార్హం. మరోవైపు యువ పేసర్ హర్షిత్ రాణా అద్భుతమైన బౌలింగ్‌తో కోల్‌కతా విజయం కోసం కష్టపడ్డాడు. Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని