Mohammed Shami: భార్యతో విడాకుల కేసు.. నెలకు రూ.4 లక్షలు ఇవ్వండి: షమికి కలకత్తా కోర్టు ఆదేశం

కోల్‌కతా: టీమ్ఇండియా బౌలర్ మహ్మద్ షమి (Mohammed Shami), అతని భార్య హసీన్ జహాన్ విడాకుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. భార్య హసీన్ జహాన్, కుమార్తె ఐరాలకు నిర్వహణ ఖర్చుల కింద నెలకు రూ.4 లక్షలు చొప్పున చెల్లించాలని కలకత్తా హైకోర్టు ఆదేశించింది. ప్రతి నెలా హసీన్ జహాన్‌కు రూ.1.50 లక్షలు, కుమార్తె ఐరాకు రూ.2.50 లక్షలు చెల్లించాలని ఆదేశాల్లో పేర్కొంది. ఈ మొత్తాన్ని ఏడేళ్ల క్రితం నుంచి వసూలు చేయాల్సి ఉంటుందని తీర్పునిచ్చింది. అలాగే, ఈ కేసును ఆరు నెలల్లోపు పరిష్కరించాలని దిగువ కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది.
షమి, హసీన్ జహాన్‌కు 2014లో వివాహం కాగా.. 2015లో ఐరా జన్మించింది. తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో వారు విడివిడిగా ఉంటున్నారు. 2018లో హసీన్ జహాన్.. షమిపై గృహ హింస ఆరోపణలతో పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. 2023లో జిల్లా సెషన్సు కోర్టు హసీన్‌కు నెలకు రూ.50వేలు, ఐరాకు రూ.80వేలు చొప్పున ఇవ్వాలని ఆదేశించగా.. ఆ తీర్పును సవాల్ చేస్తూ ఆమె హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన ఉన్నత న్యాయస్థానం తాజాగా తీర్పును వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

ఖర్గేజీ.. రాహుల్ పెళ్లి ఎప్పుడో చెప్పండి: భాజపా సెటైర్లు
 - 
                        
                            

మంత్రి అజారుద్దీన్‌కు శాఖల కేటాయింపు
 - 
                        
                            

నాకు ఏం జరిగిందో గుర్తులేదా..? థరూర్‌ను హెచ్చరించిన భాజపా నేత
 - 
                        
                            

లాలూ తాతలు దిగొచ్చినా.. ఆ సొమ్ము దోచుకోలేరు: అమిత్ షా
 - 
                        
                            

చాట్‌జీపీటీ గో ఫ్రీ ప్లాన్ .. ఎలా పొందాలంటే?
 - 
                        
                            

వివేకా హత్య కేసు.. సీబీఐ కోర్టులో సునీల్‌యాదవ్ కౌంటర్ దాఖలు
 


