Mohammed Shami Sister: క్రికెటర్ షమీ సోదరి.. ‘ఉపాధి హామీ’ కూలీ!

Eenadu icon
By Sports News Team Published : 26 Mar 2025 16:39 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ (Mohammed Shami)కి సంబంధించి జాతీయ మీడియాలో వచ్చిన వార్త చర్చనీయాంశంగా మారింది. ఈ స్టార్‌ క్రికెటర్‌ సోదరి (shami sister) పేరు ఉపాధి హామీ పథకం లబ్ధిదారుల జాబితాలో ఉండటమే అందుక్కారణం. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద షమీ సోదరి షబీమా, ఆమె భర్త కూలీ డబ్బులు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి. షబీనా, ఆమె భర్త ఉపాధి హామీ (MGNREGA) కార్మికులుగా పేర్లు నమోదు చేసుకున్నారని, 2021 నుంచి 2024 వరకు డబ్బులు తీసుకున్నారని సదరు కథనాలు పేర్కొన్నాయి. ఈ వార్తలపై షమీ గానీ, అతడి కుటుంబసభ్యుల నుంచి గానీ ఎలాంటి స్పందన రాలేదు. అయితే వాస్తవంగా వీరే తమ పేర్లు నమోదు చేసుకున్నారా లేక ఇతరులు ఇలా చేసి మోసాలకు పాల్పడుతున్నరా అన్నది తెలియరాలేదు. 

ఇటీవల ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌ సందర్భంగా షమీ తల్లి, సోదరి స్టేడియంలో కన్పించిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా గెలిచిన అనంతరం వీరు షమీతో కలిసి మైదానంలో ఫొటోలు దిగారు. ఇక, గాయం కారణంగా కొన్నాళ్ల పాటు దూరంగా ఉన్న ఈ సీనియర్‌ పేసర్‌ ఈ ఏడాది జనవరిలో టీమ్‌ఇండియాలో పునరాగమనం చేశాడు. ఛాంపియన్స్‌ ట్రోఫీలో తన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు