IPL 2024 Final - Kolkata vs Hyderabad: ఐపీఎల్ ‘ఫైనల్‌’ వెదర్‌ రిపోర్ట్.. మ్యాచ్‌ జరగకపోతే పరిస్థితేంటి?

ఐపీఎల్ ముగింపు దశకు చేరుకుంది. టైటిల్ విజేతను తేల్చే ఫైనల్‌ మ్యాచ్‌కు వేళైంది. చెపాక్‌ వేదికగా ఈ కీలక పోరు జరగనుంది.

Updated : 26 May 2024 16:39 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్‌ టైటిల్‌ కోసం కోల్‌కతా - హైదరాబాద్‌ జట్లు తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. చెన్నైలోని చెపాక్‌ వేదికగా మ్యాచ్‌ జరగనుంది. అయితే, అక్కడి వాతావరణ పరిస్థితి కాస్త ఆందోళన కలిగిస్తోంది. నిన్న వర్షం పడటంతో కోల్‌కతా తన ప్రాక్టీస్ సెషన్‌ను రద్దు చేసుకుంది. ఇవాళ కూడా ఆకాశమంతా మబ్బులతో నిండి ఉంది. ఆక్యూవెదర్ రిపోర్ట్‌ ప్రకారం పూర్తి మ్యాచ్‌కు వర్షం అంతరాయం ఉండకపోవచ్చని తెలుస్తోంది.

ఇవాళ మ్యాచ్‌ జరగకపోతే ఏమవుతుంది?

ఫైనల్‌ మ్యాచ్‌కు అంతరాయం ఇప్పటికైతే లేదు. ఒకవేళ ఏమైనా ఆటంకాలు ఏర్పడినా ఇబ్బంది లేదు. ఎలానూ రిజర్వ్‌ డే ఉంది. మ్యాచ్‌ను సోమవారం కూడా కొనసాగించేందుకు అవకాశం ఉంటుంది. ఆ రోజు కూడా వర్షం కారణంగా ఆట సాధ్యం కాకపోతే మాత్రం మ్యాచ్‌ను రద్దు చేసేస్తారు. అప్పుడు కోల్‌కతా టైటిల్‌ విజేతగా నిలుస్తుంది. హైదరాబాద్‌ రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే లీగ్‌ స్టేజ్‌ను కేకేఆర్‌ (20 పాయింట్లు) అగ్రస్థానంతో ముగించింది. హైదరాబాద్‌ (17) రెండో ప్లేస్‌కు పరిమితమైన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని