MS Dhoni: ఎకానమీ క్లాస్‌లో ప్రయాణం.. ధోనీ ‘సింప్లిసిటీ’కి నెటిజన్లు ఫిదా!

విమానంలో సామాన్యులు ప్రయాణించే ఎకానమీ క్లాస్‌లో ఎంఎస్‌ ధోనీ ప్రయాణించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో అతడిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 

Updated : 25 May 2024 15:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ (MS Dhoni).. మైదానంతో సంబంధం లేకుండా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. తన నిరాడంబరత, వ్యక్తిత్వమే అందుకు కారణమని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తాజాగా మిస్టర్‌ కూల్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ధోనీ ఇటీవల బెంగళూరు నుంచి రాంచీకి ప్రయాణించాడు. అయితే, ఆయన ఒక సామాన్యుడిలా ఎకానమీ క్లాస్‌లో ఇతరులతో కలిసి ప్రయాణించడం గమనార్హం. తన సింప్లిసిటీతో మరింత అభిమానం సొంతం చేసుకున్నాడు. వైరల్‌గా మారిన ఈ వీడియోను చూసిన నెటిజన్లు మహీ నిరాడంబరతకు ఫిదా ఆయ్యారు. ధోనీపై కామెంట్ల రూపంలో ప్రశంసల జల్లు కురిపించారు. 

‘‘మహీ సింప్లిసిటీ సూపర్‌..’’

‘‘అందుకే.. ధోనీ అందరి ఫేవరెట్‌’’

 ‘‘ఆ విమానంలో ఉన్నవారంతా ఎంతో లక్కీ.. నేను అందులో లేనందుకు బాధపడుతున్నా’’

‘‘నిరాడంబరతకు ప్రతిరూపం ఆయన.. లవ్‌ యూ ధోనీ’’ 

‘‘మిస్టర్‌ కూల్‌ పక్క సీటులో ఉన్నవారు ఎంతో అదృష్టవంతులు’’ అంటూ పోస్టులు పెట్టారు.

సన్‌రైజర్స్ బ్యాటింగే కాదు.. బౌలింగ్‌కూ పదునెక్కువే: గౌతమ్ గంభీర్

ఓటేసిన ధోనీ.. 

ఇదిలాఉండగా.. ఐపీఎల్ 17వ సీజన్‌లో ఆర్సీబీతో జరిగిన కీలక మ్యాచ్‌లో చెన్నై ఓడిపోయింది. ఫలితంగా సీఎస్కే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది. దాని తర్వాత ధోనీ రిటైర్మెంట్‌పై ఊహాగానాలు వస్తున్నాయి. దీనిపై మహీ ఇంతవరకు స్పందించలేదు. మరోవైపు.. దేశంలో సార్వత్రిక ఎన్నికల ఆరోవిడత పోలింగ్‌ కొనసాగుతోంది. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్‌సభ స్థానాలకు నేడు ఓటింగ్‌ జరుగుతోంది. ప్రస్తుతం రాంచీలో ఉన్న ధోనీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు