Punjab Vs Mumbai: ముంబయి ‘డీఆర్‌ఎస్‌ సిగ్నల్‌’పై ట్రోలింగ్‌.. టామ్‌ మూడీ ట్వీట్ వైరల్!

పంజాబ్‌పై 9 పరుగుల తేడాతో ముంబయి గెలిచింది. కానీ, ఆ జట్టుకు అంపైర్లు మద్దతుగా నిలిచారనే ఆరోపణలు వస్తున్నాయి.

Published : 19 Apr 2024 17:56 IST

ఇంటర్నెట్ డెస్క్: పంజాబ్‌తో మ్యాచ్‌ సందర్భంగా డీఆర్ఎస్ విషయంలో ముంబయి (Punjab Vs Punjab) మోసానికి పాల్పడిందని సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్‌కు తెర లేచింది. అర్ష్‌దీప్‌ వేసిన ఇన్నింగ్స్‌ 15వ ఓవర్‌లో ఐదో బంతిని ముంబయి బ్యాటర్ సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav) ఆడాడు. అయితే, ఆ బంతి అతడికి దూరంగా వెళ్లింది. ఫీల్డ్‌ అంపైర్‌ ఎలాంటి సిగ్నల్‌ ఇవ్వలేదు. కానీ, డగౌట్‌లోని ముంబయి బ్యాటర్ టిమ్‌ డేవిడ్‌తోపాటు కోచ్ మార్క్‌ బౌచర్‌ వైడ్‌ సిగ్నల్ కోసం డీఆర్‌ఎస్‌ అడగాలంటూ సైగలు చేశారు. దీనిని గమనించిన పంజాబ్ తాత్కాలిక కెప్టెన్ సామ్ కరన్ (Sam Curran) అంపైర్ దృష్టికి తీసుకెళ్లాడు. అవేవీ పట్టించుకోని ఫీల్డ్‌ అంపైర్‌ డీఆర్ఎస్‌ రిఫర్‌ చేయడం గమనార్హం. దీంతో అంపైరింగ్‌ వ్యవస్థపై సోషల్ మీడియాలో కామెంట్లు వచ్చాయి. ముంబయి జట్టుకు అనుకూలంగా మారుతుందనే ట్రోలింగ్‌ మొదలైంది. 

ఆసీస్‌ మాజీ కెప్టెన్ టామ్‌ మూడీ చేసిన ట్వీట్ కూడా వైరల్‌గా మారింది. ‘నిష్ణాతులైన థర్డ్‌ అంపైర్స్‌ను తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈసారి అంపైరింగ్‌పై అనేక ప్రశ్నలు వస్తున్నాయి’’ అని పోస్టు పెట్టాడు. అయితే, ఈ ఘటనపై ఐపీఎల్‌ అధికారికంగా స్పందించలేదు. సోషల్‌మీడియాలో మాత్రం కామెంట్లతో నెటిజన్లు చెలరేగిపోతున్నారు. 

‘‘మంబయి జట్టుకు అంపైర్లు మద్దతుగా నిలిచిన మరో ఘటన. టిమ్‌ డేవిడ్ సిగ్నల్‌ ఇస్తేనే ఫీల్డ్‌ అంపైర్ డీఆర్‌ఎస్‌ పంపాడు’’

‘‘పంజాబ్ కెప్టెన్ సామ్‌ కరన్‌ మాటలను అక్కడ పట్టించుకొనేవారే లేరు. థర్డ్‌ అంపైర్‌ కూడా ఇలా ఉంటే ఎలా?. ఇది సిగ్గు చేటు’’

‘‘గతంలో చెన్నై జట్టుపైనా ముంబయికి మద్దతుగా అంపైర్లు నిర్ణయాలు తీసుకున్నారు. అప్పుడు పాండ్య బ్యాటింగ్‌ చేస్తున్నాడు’’

‘‘గతంలో రిషభ్‌ పంత్‌ కేవలం ఒక్క సెకను మాత్రమే ఆలస్యం చేశాడు. అంపైర్లు మాత్రం దానిని తోసిపుచ్చారు. ఇప్పుడు కనీసం 15 సెకన్ల తర్వాత నిర్ణయం తీసుకోవడం విచిత్రంగా ఉంది’’

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని