IND vs NZ: భారత్‌-న్యూజిలాండ్‌ సెమీస్‌కు బెదిరింపులు.. వాంఖడే స్టేడియం వద్ద అలర్ట్‌

IND vs NZ: వన్డే ప్రపంచకప్‌ తొలి సెమీస్‌కు బెదిరింపులు రావడం కలకలం రేపింది. భారత్‌, కివీస్‌ మ్యాచ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంటుందని ఓ వ్యక్తి సోషల్‌ మీడియాలో బెదిరింపులకు పాల్పడ్డాడు.

Updated : 15 Nov 2023 10:48 IST

ముంబయి: వన్డే ప్రపంచకప్‌ (ODI World cup 2023)లో భాగంగా భారత్‌, న్యూజిలాండ్‌ (IND vs NZ)మధ్య బుధవారం సెమీ ఫైనల్‌ (Semi Final) మ్యాచ్‌ జరగనుంది. ముంబయిలోని వాంఖడే మైదానం (Wankhede Stadium) వేదికగా మధ్యాహ్నం 2 గంటల నుంచి మ్యాచ్‌ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్‌కు బెదిరింపులు రావడం కలకలం రేపింది. దీంతో ముంబయి పోలీసులు (Mumbai Police) అప్రమత్తమయ్యారు. వాంఖడే స్టేడియం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

వాంఖడే స్టేడియంలో భారత్‌ (India), న్యూజిలాండ్‌ (New Zealand) మ్యాచ్‌ జరిగే సయమంలో దారుణమైన ఘటన చోటుచేసుకోనుందంటూ గుర్తుతెలియని వ్యక్తి ‘ఎక్స్‌’లో బెదిరింపులకు పాల్పడ్డాడని ముంబయి పోలీసులు తెలిపారు. తన పోస్ట్‌లో ముంబయి పోలీసులను ట్యాగ్‌ చేసిన ఆ ఆగంతకుడు.. తుపాకీ, హ్యాండ్‌ గ్రనేడ్‌, బుల్లెట్‌ ఉన్న ఫొటోను షేర్‌ చేశాడు. దీంతో స్టేడియం, ఆ పరిసర ప్రాంతాల్లో గట్టి నిఘాను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.

వదలొద్దు ఈసారి.. అజేయ భారత్‌కు కివీస్‌ సవాల్‌

కాగా.. తాజాగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌లకు బెదిరింపులు రావడం ఇదే తొలిసారి కాదు. అక్టోబరు 14న జరిగిన భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ సమయంలోనూ ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. అహ్మాదాబాద్‌ స్టేడియంపై దాడి చేస్తామంటూ ఈ-మెయిల్‌ రావడం తీవ్ర కలకలం రేపింది. దీంతో ముమ్మర దర్యాప్తు చేపట్టిన అధికారులు నిందితుడిని అరెస్టు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని