IPL: ముంబయి ఇండియన్స్‌లోకి సంచలన బౌలర్‌.. షమి స్థానంలో సందీప్‌ వారియర్‌..

గాయం కారణంగా ఐపీఎల్‌ 2024 సీజన్‌కు దూరమైన మధుశంక స్థానంలో ముంబయి ఇండియన్స్‌ అండర్‌ 19 ప్రపంచకప్‌లో సత్తాచాటిన సౌతాఫ్రికా పేసర్‌ను తీసుకుంది. Õ 

Published : 20 Mar 2024 23:48 IST

ఇంటర్నెట్ డెస్క్: 2024 అండర్‌ 19 ప్రపంచకప్‌లో తన పేస్‌ బౌలింగ్‌ ప్రత్యర్థి జట్లకు ఆటగాళ్లకు చుక్కలు చూపించాడు సౌతాఫ్రికా పేసర్ క్వెనా మఫాకా. 17 ఏళ్ల ఈ లెప్టార్మ్‌ పేసర్‌ టోర్నీ ఆరు మ్యాచ్‌లు ఆడి 21 వికెట్లు పడగొట్టాడు. ఈ యువ బౌలర్‌ని త్వరలో ఐపీఎల్‌ (IPL)లో చూడబోతున్నాం. గతేడాది జరిగిన వేలంలో శ్రీలంక పేసర్‌ దిల్షాన్‌ మధుశంకను ముంబయి ఇండియన్స్‌ (Mumbai Indians) రూ.4.6 కోట్లకు సొంతం చేసుకుంది. కానీ, అతడు గాయం కారణంగా ఐపీఎల్‌ 2024 సీజన్‌ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో మఫాకాను కనీస ధర రూ.50 లక్షలకు ముంబయి ఇండియన్స్‌ జట్టులోకి తీసుకుంది.  

గుజరాత్ టైటాన్స్‌ పేసర్‌ మహమ్మద్‌ చీలమండ గాయానికి శస్త్రచికిత్స చేయించుకుని కోలుకుంటున్న సంగతి తెలిసిందే. అతడు ఈ సీజన్‌ మొత్తానికి అందుబాటులో ఉండటం లేదు. దీంతో షమి స్థానంలో సందీప్‌ వారియర్‌ను గుజరాత్ తమ జట్టులోకి తీసుకుంది. అతడి కనీస ధర రూ.50 లక్షలకు గుజరాత్ ఒప్పందం కుదుర్చుకుంది. సందీప్ ఇప్పటివరకు ఐదు ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఆడి రెండు వికెట్లు పడగొట్టాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు