Viral Video: సిక్సర్‌ అడ్డుకుని రనౌట్‌గా మార్చి..!

నేపాల్‌ క్రికెటర్‌ కుశాల్‌ భుర్టెల్‌ తన అద్భుతమైన ఫీల్డింగ్‌తో సిక్స్ వెళ్లే బంతిని అడ్డుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.  

Published : 04 Mar 2024 01:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నేపాల్‌లో జరుగుతున్న ట్రై సిరీస్‌లో (Nepal T20I Tri-Series 2024) నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నేపాల్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఘన విజయం సాధించింది. నెదర్లాండ్స్‌ను 120 పరుగులకే కట్టడి చేసి ఫీల్డింగ్‌లోనూ అదరగొట్టింది. ఈ క్రమంలో సిక్స్‌గా వెళ్లే బంతిని అడ్డుకోవడమే కాకుండా.. బ్యాటర్‌ను రనౌట్‌ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

19వ ఓవర్‌లో దీపేందర్‌ సింగ్‌ వేసిన ఫుల్‌టాస్‌ బంతిని వాండెర్‌ మెర్వ్‌ లాంగాన్‌ వైపు భారీ షాట్‌ కొట్టాడు. సిక్స్‌ వెళ్లేలా కనిపించిన బంతిని.. కుశాల్‌ భుర్టెల్‌ బౌండరీ లైన్‌ వద్ద అమాంతం గాల్లోకి ఎగిరి అడ్డుకుని ఔరా అనిపించాడు. బ్యాటర్లు రెండో పరుగు తీస్తుండగా బంతిని వికెట్‌ కీపర్‌ వైపు విసరడంతో కింగ్మా 4 పరుగుల వద్ద రనౌటయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని