T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్.. టార్గెట్ 107.. చెమటోడ్చి నెగ్గిన నెదర్లాండ్స్

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గ్రూప్‌ డిలో నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 107 స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి నెదర్లాండ్స్‌ చెమటోడ్చింది.

Updated : 05 Jun 2024 01:13 IST

డల్లాస్‌: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గ్రూప్‌ డిలో నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్.. 106 పరుగులకే కుప్పకూలింది. బ్యాటింగ్‌లో విఫలమైనా బంతితో రాణించి ప్రత్యర్థి జట్టుకు చెమటలు పట్టించింది నేపాల్. దీంతో 107 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి నెదర్లాండ్స్‌ చెమటోడ్చింది. 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి నెగ్గింది. మాక్స్‌ ఓడౌడ్‌ (54*) అర్ధ శతకంతో రాణించాడు. విక్రమ్‌జిత్ సింగ్ (22), సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ (14), బాస్ డి లిడే (11*) పరుగులు చేశారు. మైకేల్ లెవిట్ (1), స్కాట్ ఎడ్వర్డ్స్ (5) నిరాశపర్చారు. నేపాల్ బౌలర్లలో సోమ్‌పాల్ కమి, దీపేందర్ సింగ్, అబినాష్ బోహరా తలో వికెట్ పడగొట్టారు. 

నేపాల్ బ్యాటర్లలో కెప్టెన్ రోహిత్ పౌడెల్ (35) టాప్‌ స్కోరర్‌. అనిల్ సాహ్ (11), గుల్సన్ ఝా (14), కరణ్ కేసీ (17) పరుగులు చేయగా.. మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. టిమ్ ప్రింగిల్ (3/20), వాన్‌ బిక్ (3/18), వాన్ మీకెరెన్ (2/19), బాస్ డి లీడే (2/22) నేపాల్ పతనాన్ని శాసించారు.  


ఇంగ్లాండ్, స్కాట్లాండ్ మ్యాచ్‌ రద్దు

గ్రూప్‌ బిలో ఇంగ్లాండ్, స్కాట్లాండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. టాస్ ఓడి స్కాట్లాండ్ బ్యాటింగ్‌కు దిగగా ఏడో ఓవర్‌ జరుగుతుండగా వర్షం మొదలైంది. తర్వాత కొంతసేపటికి వాన తగ్గడంతో మ్యాచ్‌ను పున: ప్రారంభించారు. 10 ఓవర్లు పూర్తి అయిన తర్వాత వరుణుడు మరోసారి ఆటంకం కలిగించాడు. అప్పటికి స్కాట్లాండ్ 90/0 స్కోరు చేసింది. వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు