Pakistan vs Canada: రిజ్వాన్‌ అర్ధశతకం.. కెనడాపై కష్టంగా నెగ్గిన పాకిస్థాన్‌

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా కీలక పోరులో కెనడాపై పాకిస్థాన్‌ 7 వికెట్ల తేడాతో నెగ్గింది. దీంతో ఆ జట్టు తన సూపర్‌ 8 అవకాశాలను సజీవంగా నిలుపుకుంది.  

Updated : 11 Jun 2024 23:32 IST

న్యూయార్క్‌: టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup)లో భాగంగా కీలకపోరులో కెనడా (Canada)పై పాకిస్థాన్‌ (Pakistan) 7 వికెట్ల తేడాతో కష్టంగా నెగ్గింది. 107 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన పాక్‌ 17.3 ఓవర్లో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. రిజ్వాన్‌ (53*: 53 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధశతకంతో మెరవగా, కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ (33: 33 బంతుల్లో ఒక ఫోర్‌, ఒక సిక్స్‌) రాణించాడు. అయూబ్‌ (6), ఫకార్‌ జమాన్‌ (4) విఫలమయ్యారు. కెనడా బౌలర్లలో డిల్లాన్‌ హేలిగర్‌ రెండు వికెట్లు తీయగా, జెరెమీ గోర్డాన్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు. ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడిన పాక్‌కు ఇదే తొలి విజయం. ఇంతకుముందు అమెరికా, భారత్‌ చేతిలో ఆ జట్టు ఓడిపోయింది. ఈ విజయంతో పాక్‌ తన సూపర్‌ 8 అవకాశాలను సజీవంగా నిలుపుకుంది. 

అంతకు ముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన  కెనడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. ఓపెనర్ ఆరోన్ జాన్సన్‌ (52; 44 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ శతకం బాదాడు. కలీం సనా (13), సాద్ బిన్ జాఫర్ (10), డిల్లాన్ హేలిగర్ (9) పరుగులు చేశారు. నవనీత్ ధాలివాల్ (4), పర్గత్ సింగ్ (2), నికోలస్ కిర్టన్ (1), శ్రేయస్ మొవ్వ (2) సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు.   రవీందర్‌పాల్ సింగ్ డకౌటయ్యాడు. పాక్‌ బౌలర్లలో హారిస్‌ రవూఫ్‌ 2, మహ్మద్‌ అమీర్‌ 2, షహీన్ అఫ్రిది, నసీమ్‌ షా తలో వికెట్ పడగొట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని