Praggnanandhaa: ప్రజ్ఞానందకు సీఎం స్టాలిన్‌ ప్రశంసలు.. రూ.30 లక్షల చెక్కు అందజేత

చెస్‌ ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన అనంతరం తొలిసారి స్వదేశానికి వచ్చిన గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద (Praggnanandhaa)కు ఘన స్వాగతం లభించింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ (MK Stalin) ప్రజ్ఞానందకు ప్రోత్సాహకంగా రూ.30 లక్షల చెక్కును అందజేశారు. 

Published : 30 Aug 2023 15:50 IST

చెన్నై: చెస్‌ ప్రపంచకప్‌ (Chess World Cup)లో సంచలన ప్రదర్శనతో ఫైనల్‌కు చేరుకుని రజతం పతకం అందుకున్న తర్వాత తొలిసారి స్వదేశానికి వచ్చిన ప్రజ్ఞానంద (Praggnanandhaa)కు ఘన స్వాగతం లభించింది. ప్రజ్ఞానంద ఇటీవల ముగిసిన చెస్‌ ప్రపంచకప్‌ ఫైనల్‌లో దిగ్గజ ఆటగాడు మాగ్నస్‌ కార్ల్‌సన్‌ చేతిలో పోరాడి ఓడి రన్నరప్‌గా నిలిచిన విషయం తెలిసిందే. చెన్నై విమానాశ్రయానికి వేలాది అభిమానులు తరలివచ్చి ఈ యువ గ్రాండ్‌మాస్టర్‌కు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రజ్ఞానంద తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్‌ (MK Stalin) ను ఆయన నివాసంలో తన కుటుంబసభ్యులతో కలిసి కలిశాడు. సీఎం స్టాలిన్‌ ప్రజ్ఞానందపై ప్రశంసలు కురిపించారు. 

అమ్మానాన్న చిరకాల కల నెరవేరింది.. థాంక్యూ మహీంద్రా సర్‌: ప్రజ్ఞానంద

తమిళనాడుతోపాటు యావత్‌ దేశం గర్వించేలా గొప్ప ప్రదర్శన కనబర్చాడని సీఎం కొనియాడారు. ప్రోత్సాహకంగా రూ.30 లక్షల చెక్కును అందించి మెమెంటోను బహుకరించారు. తమిళనాడు యువజన సంక్షేమం, క్రీడాశాఖ ఉదయనిధి స్టాలిన్‌ కూడా ప్రజ్ఞానందను శాలువాతో సత్కరించారు. అనంతరం ముఖ్యమంత్రి స్టాలిన్‌, ప్రజ్ఞానంద అతని కుటుంబసభ్యులతో కాసేపు ముచ్చటించారు. ‘‘ప్రజ్ఞానందను కలుసుకున్నందుకు ఆనందంగా ఉంది. గొప్ప విజయం సాధించిన తర్వాత తిరిగి చెన్నైకి వచ్చాడు. అతడు సాధించిన విజయాలు తమిళనాడుతోపాటు యావత్‌ దేశానికి కీర్తిని తెస్తాయి. మున్ముందు కూడా అతడే ఇదే ఆటతీరుతో అద్భుతమైన విజయాలు సాధించాలి’’ అని ప్రజ్ఞానందను సత్కరిస్తున్న వీడియోను స్టాలిన్‌ (x) ట్విటర్‌లో పోస్ట్ చేశారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని