IPL 2023: అతడిని దిగ్గజం కుమారుడిగా కాదు.. యువ బౌలర్‌గానే చూడండి: ప్రజ్ఞాన్ ఓజా

టీ20 క్రికెట్‌లో (T20 Cricket) ఎక్కువగా బౌలర్లపై బ్యాటర్ల ఆధిపత్యం కొనసాగుతుంటుంది. అంతమాత్రాన ఒకరిని టార్గెట్‌ చేసుకుని విమర్శలు గుప్పించడం సరైంది కాదు. అదీనూ దిగ్గజ క్రికెట్‌ కుమారుడు అయితే ఈ విమర్శలు ఇంకా భారీ స్థాయిలో ఉంటాయి.

Published : 29 Apr 2023 01:27 IST

ఇంటర్నెట్ డెస్క్: దాదాపు రెండు సీజన్ల తర్వాత ముంబయి తరఫున ఐపీఎల్‌లోకి (IPL) అరంగేట్రం చేసిన యువ బౌలర్ అర్జున్ తెందూల్కర్‌పై (Arjun Tendulkar) ప్రశంసలతోపాటు విమర్శలూ పెద్ద స్థాయిలోనే వచ్చాయి. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో 31 పరుగులు ఇవ్వడంతో విమర్శకులు తమ నోటికి పనిచెప్పారు. అయితే  హైదరాబాద్‌, గుజరాత్‌పై మాత్రం ఉత్తమ ప్రదర్శన ఇచ్చాడు.  ఈ క్రమంలో విమర్శలు చేసే వారికి టీమ్‌ఇండియా మాజీ ఆటగాడు ప్రజ్ఞాన్ ఓజా విజ్ఞప్తి చేశాడు. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ కుమారుడిగా కాకుండా.. ఓ యువ బౌలర్‌గా పరిగణించాలని సూచించాడు. 

‘‘పంజాబ్‌తో మ్యాచ్‌ తర్వాతి రోజు జహీర్‌ఖాన్‌తో మాట్లాడా. అర్జున్‌ నెట్స్‌లో చాలా తీవ్రంగా శ్రమిస్తాడని చెప్పాడు. అతడి డెడికేషన్‌ అద్భుతమన్నాడు. అందుకే, క్రికెట్‌ దిగ్గజం కుమారుడిగా కాకుండా అతడిని వ్యక్తిగతం మాత్రమే జడ్జ్‌ చేయాలని అందరికీ చెబుతున్నా. తప్పకుండా అర్జున్‌ మెరుగవుతూనే ఉంటాడు. టీ20 క్రికెట్‌ను ఆడుతున్నంత కాలం స్కిల్స్‌ను పెంచుకుంటూ వెళ్లాలి. ఇలాంటి మెగా లీగ్‌ల్లో రాణించాలంటే  అవి మరింత ముఖ్యం. భారీ స్థాయి క్రికెట్‌లో ఆటోమేటిక్‌గా నేర్చుకుంటూనే ఉంటారు. గుజరాత్‌పై అర్జున్ కేవలం రెండు ఓవర్లలో 9 పరుగులు మాత్రమే ఇచ్చాడు. భారీ హిట్టర్లు కలిగిన గుజరాత్‌పై అలా బౌలింగ్‌ చేయడం సులువేం కాదు. బంతిని స్వింగ్‌ చేయడానికి అర్జున్‌ ప్రయత్నిస్తున్నాడు. అతడిలో ఆ సత్తా ఉంది. అలాగే యార్కర్లను సంధించగలడు. ఆ టెంపర్‌మెంట్‌, నైపుణ్యం ఉండటం చాలా మంచిది. అలాగే తీవ్రంగా శ్రమించాలని అనుకుంటాడు. యువ బౌలర్‌కు తగినన్ని అవకాశాలు ఇస్తేనే తానేంటో నిరూపించుకోగలడు’’ అని ఓజా తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు