Rahul Dravid: న్యూయార్క్‌ స్టేడియం.. గాయాల విషయంలో తస్మాత్ జాగ్రత్త: ద్రవిడ్

మరో రెండు రోజుల్లో భారత జట్టు ప్రపంచ కప్‌ సంగ్రామంలో తొలి మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే వార్మప్‌లో సత్తా చాటిన ఆటగాళ్లు సమరోత్సాహంతో ఉన్నారు.

Updated : 03 Jun 2024 14:14 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌లో (T20 World Cup 2024) భారత్‌ లీగ్‌ స్టేజ్‌లో మూడు మ్యాచ్‌లను న్యూయార్క్‌లోని నాసౌవ్‌ కౌంటీ స్టేడియం వేదికగా.. మరో మ్యాచ్‌ను ఫ్లోరిడా మైదానంలో ఆడనుంది. బంగ్లాదేశ్‌తో వార్మప్ మ్యాచ్‌ కూడా నాసౌవ్‌లోనే జరిగింది. ఇందులో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించింది. అయితే, ఇక్కడ ఆడేటప్పుడు ఆటగాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలని భారత ప్రధాన కోచ్‌ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) హెచ్చరించాడు. 

‘‘మైదానం చాలా సాఫ్ట్‌గా ఉంది. ఫీల్డింగ్‌ చేసేటప్పుడు ఆటగాళ్లు జాగ్రత్తగా ఉండాలి. కండరాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ అంశంపై దృష్టిసారించాలి. స్పాంజీలా అనిపించింది. మైదానం కింద ఎక్కువగా ఇసుకతో నింపినట్లు అనిపిస్తోంది. రిథమ్‌ను అందుకోవడంపై శ్రమించాలి. వార్మప్ మ్యాచ్‌లో మా ఆటగాళ్లు రాణించారు. బౌలింగ్‌లోనూ బంగ్లాపై ఆధిపత్యం ప్రదర్శించారు. పిచ్‌ ఎలా ఉందనేదానిపై ఓ అవగాహన వచ్చింది. వార్మప్‌ను చూసేందుకూ అభిమానులు రావడం మరింత సంతోషంగా అనిపించింది’’ అని ద్రవిడ్ తెలిపాడు. 

యశస్వి బౌలింగ్‌ కూడా చేయొచ్చు: ఇర్ఫాన్‌

యశస్వి జైస్వాల్‌ను కేవలం బ్యాటింగ్‌ కోసమే ఎంపిక చేయలేదని.. అతడితో బౌలింగ్‌ చేయించే అవకాశం ఉందని భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్యానించాడు. ‘‘ఇప్పుడున్న టీమ్‌లో రోహిత్, విరాట్, సూర్య బౌలింగ్‌ చేయరు. రెండు కాంబినేషన్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. అందులో ఒకటి.. ఆరుగురు బౌలర్లతో ఆడటం. అక్షర్ పటేల్‌ను తీసుకుంటే బ్యాటింగ్‌ లైనప్‌ బలంగా మారుతుంది. నలుగురు ప్రధాన బౌలర్లతోపాటు శివమ్‌ దూబె, హార్దిక్‌ పాండ్య ఎలానూ బంతులేస్తారు. నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేస్తూ.. ఇప్పటి వరకు మ్యాచుల్లో బౌలింగ్‌ చేయని మరొక ఆటగాడూ ఉన్నాడు. అతడు యశస్వి జైస్వాల్. తప్పకుండా అతడితో ఒకటి లేదా రెండు ఓవర్లు వేయించే ఛాన్స్‌ ఉంది. హార్దిక్‌ నాలుగు ఓవర్ల కోటా పూర్తిచేస్తే మాత్రం భారత్‌కు బౌలింగ్‌ సమస్య తీరినట్లే’’ అని పఠాన్ తెలిపాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు