Rajasthan vs Kolkata: రాజస్థాన్‌, కోల్‌కతా మ్యాచ్‌కు వరుణుడి ఆటంకం.. మ్యాచ్‌ రద్దయితే హైదరాబాద్‌కు లాభం..

ఐపీఎల్ 17వ సీజన్‌లో రాజస్థాన్‌, కోల్‌కతా మధ్య జరగాల్సిన చివరి లీగ్ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగిస్తున్నాడు. 

Updated : 19 May 2024 20:40 IST

గువాహటి: ఐపీఎల్ 17వ సీజన్‌లో నేటితో లీగ్ దశ మ్యాచ్‌లు ముగుస్తాయి. రాజస్థాన్‌, కోల్‌కతా మధ్య జరగాల్సిన చివరి లీగ్ మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగిస్తోంది. మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తోన్న గువాహటిలో టాస్‌ వేయడానికి కంటే ముందు నుంచే వాన కురుస్తోంది. దీంతో మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. ప్రస్తుతం వర్షం ఇంకా కొనసాగుతోంది. 

మ్యాచ్‌ రద్దయితే హైదరాబాద్‌కు లాభం.. 

రాజస్థాన్‌కు ఇది కీలక మ్యాచ్‌. పంజాబ్‌పై హైదరాబాద్‌ (17 పాయింట్లు) విజయం సాధించి రెండో స్థానానికి చేరింది. ప్రస్తుతం రాజస్థాన్‌ (16 పాయింట్లు) మూడో స్థానంలో ఉంది. కోల్‌కతాపై గెలిచి తిరిగి రెండో స్థానానికి చేరుకోవాలని సంజు సేన భావిస్తోంది. ఒకవేళ వరుణుడు శాంతించక మ్యాచ్‌ రద్దయితే రాజస్థాన్‌కు భారీ నష్టం కలుగుతుంది. ఇరుజట్లకు చెరో పాయింట్ కేటాయిస్తారు. అప్పుడు 17 పాయింట్లతో రాజస్థాన్‌ లీగ్ దశను ముగిస్తుంది. దీంతో హైదరాబాద్‌, రాజస్థాన్‌ సమానంగా నిలుస్తాయి. ఇలా జరిగితే రాజస్థాన్‌ (+0.273) కంటే మెరుగైన రన్‌రేట్‌ ఉన్న సన్‌రైజర్స్‌ (+0.414) రెండో స్థానంలోనే ఉంటుంది.  మొదటి రెండు స్థానాల్లో ఉన్న జట్లు క్వాలిఫయర్‌- 1 ఆడతాయి. ఇందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుతుంది. ఓడినా మరో అవకాశం ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు