Rajasthan vs Mumbai: శతకం బాదిన జైస్వాల్‌.. ముంబయిపై రాజస్థాన్‌ ఘన విజయం

ముంబయితో జరిగిన పోరులో రాజస్థాన్‌  9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ 18.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్‌ కోల్పోయి ఛేదించింది. ఆజట్టు ఆటగాడు యశస్వి జైస్వాల్‌ (104*) శతకంతో అదరగొట్టాడు.   

Published : 23 Apr 2024 00:05 IST

జైపుర్‌: ఐపీఎల్‌ 17వ సీజన్‌లో రాజస్థాన్‌ జైత్రయాత్ర కొనసాగుతోంది. సొంతమైదానంలో ముంబయితో జరిగిన పోరులో ఆ జట్టు 9 వికెట్ల తేడాతో నెగ్గింది. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్ (104*; 60 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్స్‌లు) శతకంతో కదం తొక్కడంతో 180 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్‌ 18.4 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. మరో ఓపెనర్‌ జోస్‌ బట్లర్‌ (35; 25 బంతుల్లో 6 ఫోర్లు), కెప్టెన్‌ సంజు శాంసన్‌ (38*; 28 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. ఈ మ్యాచ్‌తో రాజస్థాన్‌ ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో 7 విజయాలు సాధించగా, ముంబయికిది ఐదో ఓటమి.

తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. టాప్‌ ఆర్డర్‌లో రోహిత్ శర్మ (6), ఇషాన్‌ కిషన్ (10) విఫలమయ్యారు. తిలక్ వర్మ (65; 45 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ శతకం బాదాడు. నేహల్ వధేరా (49; 24 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు. మహ్మద్‌ నబీ (23; 17 బంతుల్లో) ఫర్వాలేదనిపించాడు. రాజస్థాన్‌ పేసర్ సందీప్ శర్మ (5/18) ఆకట్టుకున్నాడు. ట్రెంట్ బౌల్ట్ 2, అవేశ్ ఖాన్‌, చాహల్ తలో వికెట్ పడగొట్టారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని