Rajat Patidar hits a century: శతకం బాదిన రజత్‌ పాటిదార్‌

Eenadu icon
By Sports News Team Published : 28 Aug 2025 19:45 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: దులీప్‌ ట్రోఫీలో భాగంగా నార్త్ ఈస్ట్‌జోన్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో.. సెంట్రల్ జోన్‌ కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ (Rajat Patidar) సెంచరీ సాధించాడు. 96 బంతులను ఎదుర్కొని 125 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతడు 21 ఫోర్లు, మూడు సిక్స్‌లు బాదాడు. దులీప్ ట్రోఫీ మొదటి మ్యాచ్‌ (క్వార్టర్‌ ఫైనల్‌) మొదటి రోజే రజత్‌ పాటిదార్ సెంచరీ కొట్టి సత్తా చాటాడు. బౌలర్లు సంధించిన బంతులను మైదానానికి అన్నివైపులా తరలించాడు. 

పాటిదార్‌ తుపాను ఇన్నింగ్స్‌ ఆడితే, మూడో స్థానంలో బరిలోకి దిగిన కుడి చేతి బ్యాటర్‌ డానిష్‌ మాలేవార్‌ ఏకంగా సునామీనే సృష్టించాడు. ఆటముగిసే సమయానికి అతడు 219 బంతుల్లో 198* పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఏకంగా 35 ఫోర్లు, ఒక సిక్సర్‌తో విరుచుకు పడ్డాడు. రజత్‌ పటీదార్ పెవిలియన్‌ చేరినప్పటికీ, మాలేవార్ బ్యాటింగ్‌ నైపుణ్యంతో స్కోర్‌బోర్డు పరుగులు పెట్టింది. ప్రస్తుతం సెంట్రల్‌ జోన్‌ రెండు వికెట్ల నష్టానికి 432 పరుగులు చేసి, పటిష్ఠ స్థితిలో ఉంది. 

అలాగే ఈస్ట్‌జోన్‌, నార్త్‌ జోన్‌కు మధ్య మరో క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరిగింది. ఈ పోరులో నార్త్‌ జోన్‌ తరఫున టీమ్‌ఇండియా (Team India) సీనియర్‌ బౌలర్‌ మహ్మద్‌ షమీ (Mohammed Shami) బరిలోకి దిగాడు. తొలి రోజు అతడు 17 ఓవర్లు బౌలింగ్‌ వేశాడు. మూడో స్పెల్‌లో సలీల్‌ లోత్రాను 19 పరుగులకే ఔట్ చేసి, తాను రిథమ్‌లోనే ఉన్నానని షమీ చాటి చెప్పాడు. ప్రారంభంలో మామూలుగా కనిపించినప్పటికీ, తర్వాత అతడు నిప్పులు చెరిగే బంతులు సంధించాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని