Ravi Shastri: అలాంటి సిరీస్‌లతో సమయం వృథా: రవిశాస్త్రి

రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని, భవిష్యత్‌ ఇలాంటి సిరీస్‌లు నిర్వహించొద్దని భారత మాజీ కోచ్‌ రవిశాస్త్రి (Ravi Shastri) బీసీసీఐకి సూచించాడు. 

Published : 06 Jan 2024 18:35 IST

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల దక్షిణాఫ్రికా టూర్‌లో టీమ్‌ ఇండియా (Team India) మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడింది. టెస్టు, టీ20 సిరీస్‌లు 1-1 తేడాతో సమం కాగా.. వన్డే సిరీస్‌ను భారత్‌ 2-1తో కైవసం చేసుకుంది. తొలి టెస్టు మూడు రోజుల్లో ముగియగా.. కేప్‌టౌన్‌లో జరిగిన రెండో టెస్టు రెండు రోజుల్లోనే పూర్తయింది. 107 ఓవర్లలోనే ఫలితం వచ్చింది. టెస్టు క్రికెట్‌ చరిత్రలో అతి తక్కువ బంతుల్లో ముగిసిన మ్యాచ్‌ ఇదే. ఈ నేపథ్యంలో టూర్‌లో రెండే టెస్టు మ్యాచ్‌లు నిర్వహించడంపై భారత మాజీ కోచ్‌ రవిశాస్త్రి (Ravi Shastri) అసంతృప్తి వ్యక్తం చేశాడు. రెండు టెస్టు మ్యాచ్‌లతో సిరీస్‌ను నిర్వహించడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదన్నాడు. 

‘‘ఈ టెస్ట్ సిరీస్ చూశాక మరోసారి కేవలం రెండు టెస్టుల సిరీస్‌లు ఆడకుండా బీసీసీఐ (BCCI) జాగ్రత్త వహించాలి.  ఏదైనా బోర్డు (దేశం) ఇలాంటి తరహా సిరీస్‌ కోసం ఆహ్వానిస్తే ‘మేము రాం’ అని చెప్పాలి. రెండు టెస్టుల సిరీస్‌ను నిర్వహించడం వల్ల సమయం వృథా. అది స్వదేశంలోనైనా, విదేశాల్లోనైనా’’ అని సూచించాడు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని