Ashish Nehra: టీ20లకు భారత్‌ కోచ్‌ పదవి.. ఆశిశ్ నెహ్రా వద్దనడానికి కారణాలు ఇవేనా?

గుజరాత్‌ టైటాన్స్‌ కోచ్‌ ఆశిశ్ నెహ్రాను (Ashish Nehra) టీమ్‌ఇండియా కోచింగ్‌ పదవి వరించినా.. వద్దని చెప్పడం క్రికెట్‌ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేశాయి.

Published : 30 Nov 2023 15:10 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా (Team India) కోచింగ్‌ పదవి అంటే వద్దని ఎవరైనా చెప్పగలరా? కానీ, భారత మాజీ ఆటగాడు ఆశిశ్‌ నెహ్రా మాత్రం రిజెక్ట్‌ చేశాడనే వార్తలు వచ్చాయి. దీంతో అన్ని ఫార్మాట్లకూ రాహుల్‌ ద్రవిడ్‌ను కొనసాగిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ద్రవిడ్‌ కూడా కొనసాగింపునకు అంగీకరించాడు. దీంతో బీసీసీఐ అధికారిక ప్రకటన జారీ చేసింది. నెహ్రా వద్దనడానికి కూడా కారణాలు ఉన్నాయనే కథనాలు పీటీఐలోనూ వస్తున్నాయి. 

ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్‌ కోచ్‌గా ఉన్న నెహ్రా జాతీయ జట్టుకు కోచ్‌గా రావాలంటే ఐపీఎల్‌ నుంచి బయటకు రావాల్సి ఉంటుంది. కానీ, గుజరాత్‌తో అతడి కాంట్రాక్ట్‌ 2025 వరకూ ఉంది. నెహ్రాకు కుటుంబపరమైన ఇబ్బందులూ ఉన్నట్లు సమాచారం. చిన్న పిల్లలు ఉండటంతో కుటుంబాన్ని వీడి టోర్నీల కోసం విదేశాల్లో పర్యటించడం కూడా కష్టమవుతుందనే భావనతో నెహ్రా ఆ ఆఫర్‌ను తిరస్కరించాడని క్రికెట్‌ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం గుజరాత్‌ టైటాన్స్‌తో రెండున్నర నెలలపాటు కోచింగ్‌ బాధ్యతలు నిర్వర్తించడమే మంచిదనే ఉద్దేశంతో ఉన్నాడు. ఇప్పటికే గుజరాత్ ఫ్రాంచైజీ నుంచి కెప్టెన్‌గా ఉన్న హార్దిక్‌ పాండ్య జట్టును వీడాడు. ఇలాంటి సమయంలో వదిలేసి వెళ్లడం సరైన నిర్ణయం కాదనే నెహ్రా అనుకున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. భవిష్యత్తులో పరిమిత ఓవర్ల క్రికెట్‌కు కోచ్‌గా  బాధ్యతలు అప్పగించాలంటే నెహ్రా పేరును కూడా పరిశీలనలోకి వస్తుంది. 

ఆశిశ్‌ నెహ్రా గుజరాత్‌ టైటాన్స్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి ఏడాదే ఆ  జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. ఇక జీటీ ఆడిన రెండో సీజన్‌లో ఫైనల్‌కు చేరుకుంది. కానీ, చెన్నై సూపర్‌ కింగ్స్‌ చేతిలో ఓటమిపాలైనప్పటికీ గుజరాత్‌ ఆటతీరు అందర్నీ ఆకట్టుకుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని