Jay Shah: బీసీసీఐ కార్యదర్శి జై షాకి ఐసీసీలో కీలక పదవి!

ఐసీసీకి మరోసారి ఛైర్మన్‌గా గ్రెగ్‌ బార్‌క్లే ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. తాజాగా బీసీసీఐ కార్యదర్శి జై షాకి కీలక పదవి లభిస్తున్నట్లు సమాచారం. అయితే వచ్చేవారం జరిగే ఐసీసీ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

Published : 12 Nov 2022 21:50 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షాకి మరో కీలక పదవి దక్కినట్లు తెలుస్తోంది. అయితే ఈసారి అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) కావడం గమనార్హం. ఐసీసీ ఆర్థిక, వాణిజ్య అఫైర్స్ కమిటీకి చీఫ్‌గా జై షా నియమితులు కానున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అయితే అధికారికంగా ఐసీసీ వెల్లడించాల్సి ఉంది. ఐసీసీ ఈవెంట్స్‌ కోసం అవసరమైన నిధుల కేటాయింపు, బడ్జెట్‌ను నిర్ణయించే అధికారం ఈ కమిటీకి ఉంటుంది. 

ఐర్లాండ్‌ క్రికెట్‌ బోర్డు మాజీ ఛైర్మన్ రాస్ మెక్‌కల్లమ్ ప్రస్తుతం కమిటీకి చీఫ్‌గా వ్యవరిస్తున్నారు. ఆయన త్వరలో రిటైర్‌ కాబోతున్నారు. దీంతో రాస్‌ స్థానంలో జై షా పదవిని అందుకొంటారు. మార్చి 2023లో కమిటీ సమావేశం జై షా అధ్యక్షతన జరిగే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే ఐసీసీ ఛైర్మన్‌గా గ్రెగ్ బార్‌క్లే మరోసారి ఎన్నికైన విషయం తెలిసిందే. మెల్‌బోర్న్‌ వేదికగా వచ్చేవారం జరిగే ఐసీసీ బోర్డు సమావేశాల్లో పాల్గొనేందుకు బీసీసీఐ తరఫున జై షా, భారత టీ20 లీగ్‌ ఛైర్మన్‌ అరుణ్‌ ధుమాల్‌ ఇప్పటికే ఆస్ట్రేలియాకు చేరుకొన్నారు. ఐసీసీ బోర్డులో బీసీసీఐ ప్రతినిధిగా మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ స్థానంలో ఈసారి జై షా ఉంటాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని