Rishabh Pant: ఏడు నెలలు నరకం చూశా.. ప్రాణాలతో ఉంటా అనుకోలేదు: రిషభ్‌ పంత్‌

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడినప్పుడు ఎదుర్కొన్న సమస్యలను భారత స్టార్‌ క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌ గుర్తు చేసుకున్నాడు.

Updated : 28 May 2024 15:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సుదీర్ఘ విరామం తర్వాత మైదానంలోకి అడుగుపెట్టిన భారత స్టార్‌ క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌ (Rishabh Pant) ఐపీఎల్‌లో అదరగొట్టేశాడు. దీంతో టీ20 ప్రపంచ కప్‌ కోసం ప్రకటించిన భారత జట్టులో స్థానం సంపాదించాడు. ఇప్పటికే అమెరికా చేరుకున్న పంత్‌.. తాను తీవ్రంగా గాయపడినప్పుడు ఎదుర్కొన్న సమస్యలను గుర్తు చేసుకున్నాడు. అన్ని నెలల పాటు అనుభవించిన నరక వేదన గురించి వెల్లడించాడు.

‘‘ రోడ్డు ప్రమాదం నా జీవితాన్ని చాలా మార్చింది. ఆ సమయం ఎంతో అనుభవం నేర్పింది. తీవ్ర గాయాల కారణంగా  ప్రాణాలతో ఉంటానో లేదో అనిపించింది. ఏడు నెలల పాటు భరించలేని నొప్పిని అనుభవించా. అది నరకంగా అనిపించింది. దాదాపు రెండు నెలలు బ్రష్‌ చేసుకోలేకపోయాను. వీల్‌ఛైర్‌లో ఉండే వ్యక్తులను చూస్తే ఇబ్బందిగా అనిపించేది. భయంగా ఉండేది. అందుకే ఎయిర్‌పోర్టుకు వెళ్లలేకపోయా. కానీ, భగవంతుడు రక్షించాడు’’ అని రిషభ్‌ పంత్‌ గుర్తు చేసుకున్నాడు. ఇటీవల ఓ షోలో పాల్గొన్న పంత్‌.. ఈ విషయాలను పంచుకున్నాడు.

గంభీర్ - శ్రేయస్ మాత్రమే కాదు.. కేకేఆర్‌ సక్సెస్‌లో అతడిదీ కీలక పాత్రే!

2022 డిసెంబరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో పంత్‌ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 15 నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. తిరిగి మైదానంలోకి అడుగు పెట్టేందుకు తీవ్రంగా శ్రమించాడు. ఫిట్‌నెట్‌పై దృష్టి పెట్టి పుంజుకున్నాడు. ఐపీఎల్‌లో అదరగొట్టి మరోసారి అభిమానుల ఆదరణ గెలుచుకున్నాడు. టీ20 ప్రపంచ కప్‌ కోసం టీమిండియా జట్టులో ఛాన్స్‌ సంపాదించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు