‘మామ ఆరోపణలు’.. ఇక్కడ స్పందించలేను: రవీంద్ర జడేజా భార్య రివాబా

రవీంద్ర జడేజా (Ravindra Jadeja) తండ్రి చేసిన ఆరోపణలపై స్పందించేందుకు రివాబా ఆసక్తి చూపించలేదు. 

Updated : 12 Feb 2024 12:54 IST

ఇంటర్నెట్ డెస్క్‌: తన కుమారుడు, కోడలితో చాలా కాలం నుంచి దూరంగా ఉంటున్నానని.. సరైన సంబంధాలు లేవని రవీంద్ర జడేజా తండ్రి అనిరుధ్ సిన్హ్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఒకే ఊరులో ఉంటున్నా.. తమ మధ్య దూరం ఉందని ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు. వాటిపై రవీంద్ర జడేజా సోషల్‌ మీడియా వేదికగా స్పందించాడు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న జడేజా భార్య రివాబా ఎదుట ఓ విలేకరి ఇదే ప్రశ్న ఉంచారు. సరైన సమాధానం ఇవ్వకుండా ఆమె దాటవేసేందుకు ప్రయత్నించారు.

విలేకరి: ‘‘మీ మామగారు కొన్ని ఆరోపణలు చేశారు. వాటిపై మీ స్పందనేంటి?’’

రివాబా: ఇప్పుడు మనం నిర్వహించుకుంటున్న కార్యక్రమం ఏంటి? మీరు ఏదైనా తెలుసుకోవాలంటే నేరుగా నన్నే సంప్రదించండి. ఇక్కడ మాత్రం కాదు’’

గతంలో ఏం జరిగిందంటే?

రివాబా గురించి రవీంద్ర జడేజా తండ్రి అనిరుధ్‌ ఓ ఇంటర్వ్యూలో.. ‘‘జడేజాకు రివాబాతో పెళ్లయిన దగ్గర్నుంచి మా కుటుంబంలో సమస్యలు మొదలయ్యాయి. ఆస్తులన్నీ ఆమె పేరిట మార్చాలని డిమాండ్‌ చేసింది. అతడితో పాటు విడిగా ఉండడానికే ఇష్టపడింది. జడేజాకు పెళ్లి చేయకపోయి ఉంటే బాగుండేది’ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై జడేజా స్పందిస్తూ.. ‘‘ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్న విషయాలన్నీ అబద్ధాలు, అర్థరహితం. ఇది ముందస్తు ప్రణాళికతో రూపొందిన ఇంటర్వ్యూ. నా భార్య ప్రతిష్ఠను దెబ్బ తీసేలా ఉన్న దీనిని నేను ఖండిస్తున్నా. నేను చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కానీ బహిరంగ వేదికల్లో అవన్నీ వెల్లడించలేను’’ అని పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు