Vizag: భారత క్రికెట్‌ ప్రధాన సమస్యల్లో ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ ఒకటి: రోజర్‌ బిన్నీ

దేశంలో క్రికెట్‌కు ఎదురవుతున్న ప్రధాన సమస్యల్లో ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ ఒకటని బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ తెలిపారు. దీనిని అధిగమించేందుకు అవసరమైన సహకారాన్ని బీసీసీఐ వారికి అందిస్తోందన్నారు.

Updated : 29 Aug 2023 02:09 IST

విశాఖ: దేశంలో క్రికెట్‌కు ఎదురవుతున్న ప్రధాన సమస్యల్లో ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ ఒకటని బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ తెలిపారు. దీనిని అధిగమించేందుకు అవసరమైన సహకారాన్ని బీసీసీఐ వారికి అందిస్తోందన్నారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) 70 వసంతాల వేడుకల్లో రోజర్‌ బిన్నీతో పాటు వెటరన్ క్రీడాకారుడు మదన్ లాల్, ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు పాల్గొన్నారు. ఏసీఏ కార్యవర్గంతో కలిసి పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బిన్నీ మాట్లాడారు. 

దేశంలో క్రికెట్ మౌలిక సదుపాయాలను మరింత అభివృద్ది చేసేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఏపీఎల్‌, ఐపీఎల్ వంటి టోర్నీలు ఆటగాళ్లకు ఎంతో ఉపకరిస్తున్నాయన్నారు. దేశంలో మహిళా క్రికెట్ అభివృద్ధికి ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తున్నామన్నారు. ప్రపంచ కప్ భారత్ గెలుస్తుందా? అన్న ప్రశ్నకు సమాధామిస్తూ.. క్రికెట్‌ అభిమానుల్లోని ప్రతి ముగ్గురిలో ఇద్దరు భారత్‌పై విశ్వాసం వ్యక్తం చేస్తున్నారన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని