Rohan Bopanna: బోపన్న వీడ్కోలు

Eenadu icon
By Sports News Desk Published : 02 Nov 2025 01:37 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

దిల్లీ: భారత టెన్నిస్‌లో స్టార్‌ ప్లేయర్లు అనగానే విజయ్‌ అమృత్‌రాజ్, రామనాథన్‌ కృష్ణన్, లియాండర్‌ పేస్, మహేశ్‌ భూపతి, సానియామీర్జా లాంటి పేర్లు కనిపిస్తాయి.. వారి తర్వాత భారత టెన్నిస్‌ భారాన్ని భుజాన వేసుకున్న ఆటగాడు రోహన్‌ బోపన్న. ఈ దిగ్గజ ఆటగాడు సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. 45 ఏళ్ల బోపన్న.. చివరిగా గత వారం జరిగిన పారిస్‌ మాస్టర్స్‌లో అలెగ్జాండర్‌ బబ్లిక్‌ (కజకిస్థాన్‌)తో కలిసి బరిలో దిగి తొలి రౌండ్లోనే ఓడాడు. ‘‘వీడ్కోలు.. కానీ ఇంకా ముగియలేదు. రాకెట్‌ను మాత్రం వదిలేస్తున్నా. కూర్గ్‌ నుంచి మొదలైంది నా ప్రయాణం. ఎన్నో ఒడుదుడుకులను ఎదుర్కొని అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటా. బరిలో దిగిన ప్రతిసారి గెలిచేందుకు సర్వశక్తులూ ఒడ్డా’’ అని బోపన్న తెలిపాడు. 2000లో ప్రొఫెషనల్‌గా మారిన బోపన్న.. విజయవంతమైన డబుల్స్‌ ప్లేయర్‌గా పేరు తెచ్చుకున్నాడు. రెండు దశాబ్దాల కెరీర్‌లో డేవిస్‌ కప్, గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలు, ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2017లో దబ్రౌస్కీ (కెనడా)తో కలిసి ఫ్రెంచ్‌ ఓపెన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ టైటిల్‌ సాధించాడు. కెరీర్‌లో అతడికి అదే తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌. తర్వాత 2024లో మాథ్యూ ఎబ్డెన్‌ (ఆస్ట్రేలియా) తోడుగా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ పురుషుల డబుల్స్‌ టైటిల్‌ కైవసం చేసుకున్నాడు. గతేడాది పారిస్‌ ఒలింపిక్స్‌ తర్వాత భారత్‌కు ప్రాతినిధ్యం వహించట్లేదు. 2023లో డేవిస్‌కప్‌కు వీడ్కోలు పలికాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు