Rohit Sharma: నేడు హైదరాబాద్‌తో ముంబయి మ్యాచ్‌.. చరిత్ర సృష్టించనున్న రోహిత్‌ శర్మ

హార్దిక్ పాండ్య సారథ్యంలోని ముంబయి బుధవారం హైదరాబాద్‌తో తలపడనుంది. ఈమ్యాచ్‌ స్టార్‌ బ్యాటర్‌ రోహిత్‌ శర్మకు చాలా ప్రత్యేకం కానుంది. 

Published : 27 Mar 2024 09:57 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్‌ను ముంబయి ఓటమితో ఆరంభించింది. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు విజయం ముంగిట బోల్తా పడింది. హార్దిక్ పాండ్య సారథ్యంలోని ముంబయి బుధవారం (మార్చి 27న) హైదరాబాద్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గి పాయింట్ల ఖాతాను తెరవాలని ఇరుజట్లు భావిస్తున్నాయి. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక. 

హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌ ముంబయి స్టార్‌ బ్యాటర్‌ రోహిత్ శర్మ (Rohit Sharma)కు చాలా ప్రత్యేకం. ఈ మ్యాచ్‌తో  ముంబయి తరఫున అతడు 200 మ్యాచ్‌లు పూర్తి చేసుకోబోతున్నాడు. ఐపీఎల్‌లో ఒక ఫ్రాంచైజీ తరఫున 200 లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన మూడో క్రికెటర్‌గా నిలవనున్నాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ (239 మ్యాచ్‌లు, బెంగళూరు), ఎంఎస్ ధోనీ (221, చెన్నై) రోహిత్ కంటే ముందున్నారు. హిట్‌మ్యాన్‌ 2011 నుంచి ముంబయికి ప్రాతినిధ్యం వహిస్తూ ఇప్పటివరకు 199 మ్యాచ్‌లు ఆడి 5084 పరుగులు చేశాడు. ముంబయి తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కూడా రోహితే. 2013 సీజన్‌ మధ్యలో ముంబయి పగ్గాలు అందుకున్న రోహిత్.. జట్టును ఐదుసార్లు (2013, 2015, 2017, 2019, 2020) ఛాంపియన్‌గా నిలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని