RCB vs DC: దంచికొట్టిన దిల్లీ.. బెంగళూరు ముందు కొండంత లక్ష్యం

డబ్ల్యూపీఎల్‌ 2024లో హ్యాట్రిక్‌పై కన్నేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముందు దిల్లీ క్యాపిటల్స్ భారీ లక్ష్యాన్ని ఉంచింది. 

Published : 29 Feb 2024 21:18 IST

బెంగళూరు: డబ్ల్యూపీఎల్‌ 2024లో హ్యాట్రిక్‌పై కన్నేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముందు దిల్లీ క్యాపిటల్స్ భారీ లక్ష్యాన్ని ఉంచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగి దంచికొట్టింది. 5 వికెట్ల నష్టానికి ఏకంగా 194 పరుగులు చేసింది. బ్యాటింగ్‌లో షఫాలీ వర్మ (50) అర్ధశతకంతో అదరగొట్టింది. ఓపెనర్‌ మెగ్ లానింగ్ (11) విఫలమైనా అలిస్ కాప్సే (46)తో కలిసి దూకుడుగా ఆడింది. మారిజానే కాప్ (32), జెస్ జోనాస్సెన్ (36*) రాణించారు. బెంగళూరు బౌలర్లలో సోఫీ డివైన్‌ 2, నాడిన్ డి క్లర్క్ 2, శ్రేయాంకా పాటిల్ ఒక వికెట్‌ పడగొట్టారు. మరి 195 పరుగుల భారీ లక్ష్యచేధనలో బెంగళూరు ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని