WPL 2024: హ్యాట్రిక్‌పై కన్నేసిన మంధాన సేన.. ప్రత్యర్థికి బ్యాటింగ్‌

డబ్ల్యూపీఎల్‌ 2024 మ్యాచ్‌లు థ్రిల్లింగ్‌గా సాగుతున్నాయి. రెండో సీజన్‌లో మహిళా క్రికెటర్లు అదరగొట్టేస్తున్నారు.

Updated : 29 Feb 2024 19:11 IST

బెంగళూరు: డబ్ల్యూపీఎల్‌ 2024 మ్యాచ్‌లు థ్రిల్లింగ్‌గా సాగుతున్నాయి. రెండో సీజన్‌లో మహిళా క్రికెటర్లు అదరగొట్టేస్తున్నారు. ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, దిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్‌ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే టాస్ నెగ్గిన బెంగళూరు బౌలింగ్‌ ఎంచుకుంది. ప్రత్యర్థికి బ్యాటింగ్‌ అప్పగించింది. ఇప్పటివరకూ ఆడిన రెండు మ్యాచుల్లో బెంగళూరు వరుస విజయాలు సాధించి హ్యాట్రిక్‌పై కన్నేసింది. దిల్లీ ఒక మ్యాచ్‌లో విజయం, మరో ఓటమితో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది.

బెంగళూరు జట్టు: స్మృతీ మంధాన (కెప్టెన్), సోఫీ డివైన్‌, సబ్బినేని మేఘన, నాడిన్ డి క్లర్క్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), జార్జియా వారెహమ్‌, సోఫీ మోలినెక్స్, శ్రేయాంకా పాటిల్, సిమ్రన్ బహదుర్, శోభనా ఆశా, రేణుకా ఠాకూర్‌సింగ్‌

దిల్లీ జట్టు: మెగ్ లానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, అలిస్ కాప్సే, జెమీమా రోడ్రిగ్స్, మారిజానే కాప్, అనాబెల్ సదర్లాండ్, అరుంధతి రెడ్డి, మిన్ను మణి, తానియా భాటియా (వికెట్ కీపర్), రాధా యాదవ్, శిఖా పాండే

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని