WPL 2024: డబ్ల్యూపీఎల్‌ 2024.. బెంగళూరుతో మ్యాచ్‌.. బౌలింగ్‌ ఎంచుకున్న యూపీ

డబ్ల్యూపీఎల్‌ 2024 సీజన్‌లో (WPL 2024) రెండో మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో టాస్‌ నెగ్గిన యూపీ బౌలింగ్‌ ఎంచుకుంది.

Updated : 24 Feb 2024 19:26 IST

ఇంటర్నెట్ డెస్క్‌: మహిళల ప్రీమియర్‌ లీగ్ - 2024 (WPL 2024) రెండో ఎడిషన్‌లో ఇవాళ రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు - యూపీ వారియర్స్ (RCB vs UPW) జట్ల మధ్య మ్యాచ్‌ జరగనుంది. టాస్‌ నెగ్గిన యూపీ బౌలింగ్‌ ఎంచుకుంది. బెంగళూరు కెప్టెన్‌గా స్మృతీ మంధాన, యూపీ కెప్టెన్‌గా ఎలీసా హీలే సారథిగా వ్యవహరిస్తుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈ మ్యాచ్‌ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. 

తుది జట్లు

బెంగళూరు: స్మృతీ మంధాన (కెప్టెన్), సోఫీ డివైన్‌, సబ్బినేని మేఘన, ఎల్సీ పెర్రీ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), సోఫీ మోలినెక్స్, జార్జియా వారెహమ్‌, శ్రేయాంక పాటిల్, సిమ్రన్ బహదుర్, శోభనా ఆశా, రేణుకా ఠాకూర్‌సింగ్‌

యూపీ: ఎలీసా హీలే (కెప్టెన్‌/వికెట్‌ కీపర్), సోఫీ ఎక్లెస్టోన్, తహ్లియా మెక్‌గ్రాత్, దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్, కిరణ్‌ నవ్‌గిరె, వ్రిందా దినేశ్‌, పూనమ్‌ ఖెమ్నర్, శ్వేతా షెహ్రవాత్‌, గ్రేస్‌ హారిస్‌, సైమా ఠాకూర్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని