Sachin Tendulkar: 30 ఏళ్ల క్రితం సచిన్‌ ఆట మొదలైంది ఈ రోజే..!

సరిగ్గా ఇదే రోజు.. 30 ఏళ్ల క్రితం (మార్చి 27, 1994) మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెందూల్కర్‌ కెరీర్‌ మలుపు తిరిగింది.

Updated : 27 Mar 2024 19:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సరిగ్గా ఇదే రోజు.. 30 ఏళ్ల క్రితం (మార్చి 27, 1994) మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెందూల్కర్‌ కెరీర్‌ మలుపు తిరిగింది. అది న్యూజిలాండ్‌తో మ్యాచ్‌. ఆక్లాండ్‌లో జరుగుతోంది. టీమ్‌ఇండియా రెగ్యులర్‌ ఓపెనర్‌ నవజోత్‌ సింగ్‌ సిద్ధూకు మెడ పట్టేయడంతో మ్యాచ్‌కు దూరమయ్యాడు. కెప్టెన్‌ అజారుద్దీన్‌.. సచిన్‌ను ఓపెనింగ్‌కు రావాలని కోరాడు. ఆ పిలుపే లెజెండరీ బ్యాటర్‌ కెరీర్‌లో టర్నింగ్‌ పాయింట్‌గా మారింది.

అప్పటివరకూ 69 వన్డే ఇంటర్నేషనల్స్‌ ఆడిన సచిన్‌.. 30.84 సగటుతో 1,758 పరుగులే చేశాడు. ఓపెనర్‌గా ఆడిన ఆ తొలి మ్యాచ్‌లో మాత్రం 49 బంతుల్లో (15 ఫోర్లు, 2 సిక్స్‌లు) 82 పరుగులు చేసి ఔరా అనిపించాడు. ఫలితంగా 143 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌పై సత్తా చాటింది. ఆ తర్వాత సచిన్‌ వెనక్కి తిరిగి చూసుకోలేదు. మొత్తంగా 344 వన్డేలు ఆడి 48.29 సగటుతో 15,310 పరుగులు చేశాడు. ఇందులో 49 వన్డే సెంచరీలు ఉండటం విశేషం.

1996-2007 మధ్య వన్డే క్రికెట్‌ చరిత్రలో సచిన్‌ - సౌరవ్‌ గంగూలీ (Sourav Ganguly) అత్యంత గొప్ప భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 136 ఇన్నింగ్స్‌ల్లో క్రీజును పంచుకొని.. రెండుసార్లు నాటౌట్‌గా నిలిచారు. వీరి అత్యధిక భాగస్వామ్యం 258. 49.32 సగటుతో 6,609 పరుగులు సాధించారు. ఆస్ట్రేలియాకు చెందిన ఆడమ్ గిల్‌క్రిస్ట్ (Adam Gilchrist) - మ్యాథ్యూ హెడెన్‌ 114 ఇన్నింగ్స్‌ల్లో 5,372 పరుగులు చేసి.. ODI క్రికెట్‌లో రెండో అత్యంత విజయవంతమైన ఓపెనింగ్ జోడీగా నిలిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని