Sachin Tendulkar: అర్జున్‌ ఎప్పుడైనా మిమ్మల్ని ఔట్‌ చేశాడా..?నెటిజన్‌ ప్రశ్నకు సచిన్‌ సమాధానమిదే..!

అర్జున్‌ తెందూల్కర్‌(Arjun Tendulkar) గురించి సచిన్‌(Sachin Tendulkar)కు ఓ నెటిజన్‌ నుంచి ప్రశ్న ఎదురైంది. దీనికి సచిన్‌ సరదాగా సమాధానమిచ్చి అలరించాడు.

Updated : 22 Apr 2023 15:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సచిన్‌ తనయుడు అర్జున్‌ తెందూల్కర్‌ (Arjun Tendulkar) ఈ సీజన్‌తో ఐపీఎల్‌(IPL 2023)లో అరంగేట్రం చేసి.. ముంబయి (Mumbai Indians) తరఫున రాణిస్తున్న విషయం తెలిసిందే. ఆడిన రెండో మ్యాచ్‌లోనే ఒత్తిడిని అధిగమించి డెత్‌ ఓవర్‌లో బౌలింగ్‌ చేశాడు. ప్రత్యర్థిని కట్టడి చేయడమే కాకుండా తొలి వికెట్‌ కూడా సంపాదించాడు. దీంతో అతడి ప్రదర్శనను పలువురు మెచ్చుకుంటూ.. తండ్రిగా సచిన్‌ కూడా గర్వపడాలని పేర్కొన్నారు. ఇక శుక్రవారం సచిన్‌ ట్విటర్‌లో ‘#AskSachin’ పేరిట తొలిసారి నిర్వహించిన చిట్‌చాట్‌లో.. అర్జున్‌ గురించి ఓ నెటిజన్‌ ప్రశ్నించగా.. అతడు ఆసక్తికర సమాధానమిచ్చాడు.

‘అర్జున్‌ మిమ్మల్ని ఎప్పుడైనా ఔట్‌ చేశాడా..?’ అని ఓ అభిమాని ప్రశ్నించాడు. దీనికి సచిన్‌ బదులిస్తూ.. ‘అవును.. ఒకసారి లార్డ్స్‌లో ఔట్‌ చేశాడు. అయితే ఈ విషయం అర్జున్‌కు చెప్పకండి’ అంటూ సరదాగా సమాధానమిచ్చాడు. 

ఇక ఆల్‌రౌండరైన అర్జున్‌ ఈ ఐపీఎల్‌లో ఇప్పటి వరకూ ఐదు ఓవర్లు వేశాడు. దాదాపు 120 కి.మీ వేగంతో బంతులను సంధించాడు. అయితే బ్యాటింగ్‌ చేసే అవకాశం రాలేదు. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో బౌలింగ్‌ చేసి పరుగులను నియంత్రించి.. కెప్టెన్‌ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని