IPL: ఐపీఎల్ 2024.. సీజన్‌ మొత్తానికి లఖ్‌నవూ పేసర్‌ దూరం

లఖ్‌నవూ పేసర్ శివమ్‌ మావి (Shivam Mavi) ఐపీఎల్ 2024 సీజన్‌ మొత్తానికి దూరమయ్యాడు.

Published : 03 Apr 2024 21:12 IST

ఇంటర్నెట్ డెస్క్: లఖ్‌నవూ పేసర్ శివమ్‌ మావి (Shivam Mavi) ఐపీఎల్ 2024 సీజన్‌ మొత్తానికి దూరమయ్యాడు. గాయంతో బాధపడుతున్న అతడు ఈ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదని లఖ్‌నవూ ఫ్రాంచైజీ పేర్కొంది. ‘‘శివమ్‌ మావి గాయం కారణంగా దురదృష్టవశాత్తూ ఐపీఎల్ 2024లో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఇంత త్వరగా అతడు సీజన్‌ మొత్తానికి దూరమవుతుండటం నిరాశకు గురి చేసింది. రాబోయే రోజుల్లో అతడి రికవరీ ప్రక్రియలో ఫ్రాంచైజీ మద్దతుగా నిలుస్తుంది. అతడు వేగంగా పూర్తిస్థాయిలో కోలుకోవాలని ఆశిస్తున్నాం’’ అని లఖ్‌నవూ ఫ్రాంచైజీ ఓ ప్రకటనను విడుదల చేసింది. 

శివమ్‌ మావి గతేడాది గుజరాత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. కానీ, ఒక్క మ్యాచ్‌లోనూ ఆడే అవకాశం రాలేదు. 2023 డిసెంబరులో జరిగిన వేలంలో అతడిని లఖ్‌నవూ రూ.6.4 కోట్లకు సొంతం చేసుకుంది. 2018లో కోల్‌కతా తరఫున అరంగేట్రం చేసిన మావి 2022 సీజన్‌ వరకు అదే జట్టుకు ఆడాడు. ఇప్పటివరకు 32 మ్యాచ్‌లు ఆడి 30 వికెట్లు పడగొట్టాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని