Australia: ఆ ఏడుగురికి ఇది రెండో కప్పు

Eenadu icon
By Sports News Desk Updated : 20 Nov 2023 03:50 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

స్ట్రేలియా (Australia) జట్టులో ప్యాట్‌ కమిన్స్‌, డేవిడ్‌ వార్నర్‌, మిచెల్‌ స్టార్క్‌, హేజిల్‌వుడ్‌, మ్యాక్స్‌వెల్‌, స్టీవ్‌ స్మిత్‌, మిచెల్‌ మార్ష్‌లకు ఇది రెండో ప్రపంచకప్‌ (Icc World Cup) టైటిల్‌. 2015లో కప్‌ గెలిచిన జట్టులోనూ ఈ ఏడుగురు సభ్యులు.

డిసిల్వా తర్వాత..

అరవింద డిసిల్వా తర్వాత ప్రపంచకప్‌ ఫైనల్లో ఛేదనలో సెంచరీ చేసిన ఘనత ట్రావిస్‌ హెడ్‌దే. ఈ ఇద్దరూ ఉపఖండంలో జరిగిన టోర్నీలోనే ఈ ఘనత సాధించడం విశేషం. 1996 టోర్నీలో ఆస్ట్రేలియాపై డిసిల్వా (107 నాటౌట్‌) అజేయ సెంచరీ చేయగా.. ఇప్పుడు ఆసీస్‌ బ్యాటర్‌ హెడ్‌ శతకంతో అతడి సరసన చేరాడు.


అతిరథ మహారథులు..

ఈ ఫైనల్‌ను వీక్షించేందుకు అతిరథ మహారథులు స్టేడియానికి విచ్చేశారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్‌ మార్లెస్‌ ఈ మ్యాచ్‌కు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీళ్లిద్దరు కలిసి ఆస్ట్రేలియా కెప్టెన్‌ కమిన్స్‌కు ట్రోఫీ అందజేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, క్రీడల మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్‌ సంగ్మా, షారుక్‌ ఖాన్‌, దీపికా పదుకొణె, రణ్‌వీర్‌ సింగ్‌, ప్రకాశ్‌ పదుకొణె, ఆశా భోంస్లే, విక్టరీ వెంకటేశ్‌, సద్గురు తదితరులు హాజరయ్యారు.

Tags :
Published : 20 Nov 2023 03:44 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు