Shah Rukh - Gambhir: గౌతమ్‌ గంభీర్‌ బాధ పడొద్దు.. కాస్త నవ్వుతూ ఉండు: షారుఖ్ ఖాన్‌

ఈ సీజన్‌లో కోల్‌కతాకు రెండో ఓటమి ఎదురైంది. భారీ లక్ష్య ఛేదనలో రాజస్థాన్‌ చివరి బంతికి గెలిచింది.

Published : 17 Apr 2024 14:25 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారీ స్కోరు సాధించినా కోల్‌కతాకు మాత్రం విజయం మాత్రం దక్కలేదు. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ గెలిచింది. దీంతో కేకేఆర్‌ మెంటార్‌గా ఉన్న గౌతమ్‌ గంభీర్‌ (Gautam Gambhir) తీవ్ర నిరాశకు గురయ్యాడు. సహజంగా జట్టు గెలిచినా.. ఓడినా ప్రదర్శన గురించి కోచ్‌ లేదా మెంటార్‌ ఆటగాళ్లను ఉద్దేశించి మాట్లాడతారు. కానీ, తన జట్టు ప్లేయర్లలో ఉత్సాహం తెచ్చేందుకు కోల్‌కతా సహ యజమాని షారుఖ్‌ఖాన్ డ్రెస్సింగ్‌ రూమ్‌కు వచ్చాడు. ఆట గురించి మాట్లాడిన తర్వాత మెంటార్‌ గంభీర్‌ను నవ్వించేందుకు ప్రయత్నించాడు. ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

‘‘జీవితంలో మరీ ముఖ్యంగా ఆటల్లో గెలుపోటములు సహజం. రెండింటినీ సమానంగా స్వీకరించేలా ఉండాలి. రాజస్థాన్‌పై అద్భుతంగా ఆడారు. మనం ఓడిపోయామని అనుకోవడం లేదు. చివరివరకూ పోరాడటం ఎప్పటికీ గర్వకారణమే. అందుకే, ఎవరూ బాధపడొద్దు. నిరుత్సాహానికి గురి కావద్దు. డ్రెస్సింగ్ రూమ్‌కు వచ్చాక ఆ బాధ నుంచి బయటకు రావాలి. ఎప్పుడూ ఉన్నతంగా ఉండేందుకు ప్రయత్నించాలి. మనందరిలోనూ పాజిటివ్‌ ఎనర్జీ ఉంది. మైదానంలో, బయట ఇదే ఉత్సాహంతో ముందుకుసాగాలి. ప్రతీ ఒక్కరితో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఎవరూ దీనిని ఓటమిగా భావించొద్దు. మన ఆటపై గర్వంగా ఉండాలి. గౌతమ్‌ గంభీర్‌ అలా డీలా పడొద్దు. కాస్త నవ్వుతూ ఉండు. తప్పకుండా బలం పుంజుకొంటామనే నమ్మకం నాకుంది. ఇదంతా దేవుడి ప్రణాళిక అనుకోవాలి. మున్ముందు మరిన్ని విజయాలకు నాంది కావాలి’’ అని షారుఖ్ వ్యాఖ్యానించాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని