Shreyas Iyer: మీ సహకారం వల్లే నేను ఇలా ఉన్నా: శ్రేయస్ అయ్యర్‌

టీమ్‌ఇండియా బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer) ఆసియా కప్‌నకు ఎంపికై సంగతి తెలిసిందే. తాను ఫిట్‌నెస్ సాధించడానికి ఎంతగానో సహాయపడిన ఎన్‌సీఏ (NCA) సిబ్బందికి శ్రేయస్ అయ్యర్ కృతజ్ఞతలు తెలిపాడు. 

Updated : 23 Aug 2023 19:45 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer) తిరిగి టీమ్‌ఇండియా జెర్సీలో కనిపించనున్నాడు. ఆగస్టు 30 నుంచి ప్రారంభంకానున్న ఆసియా కప్‌-2023 (Asia Cup)కి శ్రేయస్‌ ఎంపికయ్యాడు. గాయం కారణంగా కొన్ని నెలలపాటు జట్టుకు దూరమైన అతడు.. బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీ (NCA)లో చాలా కాలం గడిపి ఫిట్‌నెస్‌ సాధించాడు. తాను కోలువడానికి ఎంతోగానో సహాయపడిన ఎన్‌సీఏ సిబ్బందికి శ్రేయస్ అయ్యర్ కృతజ్ఞతలు తెలిపాడు. 

మా ఆందోళనంతా పాండ్య ఫామ్‌పైనే.. కేఎల్ కోసం వెంకటేశ్‌ ప్రసాద్ ప్రత్యేక ప్రార్థనలు!

‘‘ఇది సుదీర్ఘ ప్రయాణం. నేను ఈ రోజు ఈ విధంగా ఉండటానికి  సహాయం చేసినవారికి కృతజ్ఞతలు. నేను పూర్వస్థితికి చేరుకోవడానికి అవిశ్రాంతంగా సహాయం చేస్తున్న నితిన్ భాయ్, రజనీ సార్‌తోపాటు  NCAలోని ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ అని శ్రేయస్ అయ్యర్‌ ఇన్‌స్టాలో ఎన్‌సీఏ సిబ్బందితో దిగిన ఫొటోను పంచుకున్నాడు. ఎన్‌సీఏలోనే కోలుకుంటున్న కేఎల్ రాహుల్ కూడా ఆసియా కప్‌నకు ఎంపికయ్యాడు. గాయం నుంచి ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న జస్ప్రీత్‌ బుమ్రా కూడా చోటు దక్కించుకున్నాడు. ఆసియా కప్‌ ఆగస్టు 30 నుంచి సెప్టెంబరు 17 వరకు జరగనుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ (PAK vs IND)తో భారత్‌ మ్యాచ్‌ సెప్టెంబర్‌ 2న జరగనుంది.  ఇదిలా ఉండగా.. రాబోయే వన్డే ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కాలంటే శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్ రాహుల్ ఆసియా కప్‌లో తప్పక రాణించాల్సి ఉంది. 

ఆసియా కప్‌నకు భారత జట్టు: 

రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌గిల్‌, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌, తిలక్‌ వర్మ, కేఎల్‌ రాహుల్‌, ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌పాండ్య, సూర్యకుమార్‌యాదవ్‌, రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, బుమ్రా, షమీ, సిరాజ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, అక్షర్‌ పటేల్‌, సంజూ శాంసన్‌(స్టాండ్‌ బై).

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని