SL vs SA - T20 World Cup: టీ20 ప్రపంచకప్‌.. శ్రీలంక 77 ఆలౌట్.. కష్టంగా ఛేదించిన దక్షిణాఫ్రికా

టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా శుభారంభం చేసింది. గ్రూప్‌ డిలో శ్రీలంకపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Updated : 03 Jun 2024 23:23 IST

న్యూ యార్క్: టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా శుభారంభం చేసింది. గ్రూప్‌ డిలో శ్రీలంకపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సఫారీ బౌలర్లు అన్రిచ్‌ నోకియా (4/7), కేశవ్ మహరాజ్‌ (2/22), రబాడ (2/21) విజృంభించడంతో తొలుత శ్రీలంక 77 పరుగులకే కుప్పకూలింది. టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో శ్రీలంకకు ఇదే అత్యల్ప స్కోరు. లంక బ్యాటర్లలో ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. ఓపెనర్ కుశాల్ మెండిస్ (19) టాప్‌ స్కోరర్. కమిందు మెండిస్ (11), ఎంజోలో మాథ్యూస్ (16) పరుగులు చేశారు. వానిందు హసరంగ (0), సమరవిక్రమ (0) డకౌట్‌ కాగా.. డాసున్ శనక (9), చరిత్ అసలంక (6), మహీశ్ తీక్షణ (7) సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. 

78 పరుగుల స్వల్ప లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా తడబడింది. 16.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. సౌతాఫ్రికా బ్యాటర్లలో ఓపెనర్ క్వింటన్ డికాక్ (20) పరుగులు చేయగా.. మరో ఓపెనర్ రిజా హెండ్రిక్స్ (4) నిరాశపర్చాడు. తర్వాత వచ్చిన మార్‌క్రమ్‌ (12), ట్రిస్టన్ స్టబ్స్‌ (13) రన్స్‌ చేసి వెనుదిరిగారు. హెన్రిచ్‌ క్లాసెన్ (19), డేవిడ్ మిల్లర్ (6) నాటౌట్‌గా నిలిచారు. శ్రీలంక బౌలర్లలో వానిందు హసరంగ 2, నువాన్ తుషార, డాసున్ శనక తలో వికెట్ పడగొట్టారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని