BAN vs SL: శ్రీలంక క్రికెటర్ అరుదైన ఘనత.. 147 ఏళ్ల టెస్టు క్రికెట్‌ చరిత్రలో తొలి బ్యాటర్‌గా రికార్డు

బంగ్లాదేశ్‌ పర్యటనలో శ్రీలంక క్రికెటర్లు అదరగొట్టేశారు. తొలి టెస్టులో పట్టు సాధించడంతోపాటు రికార్డులను తమ పేరిట నమోదు చేసుకున్నారు.

Updated : 25 Mar 2024 09:55 IST

ఇంటర్నెట్ డెస్క్: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో (BAN vs SL) శ్రీలంక బ్యాటర్‌ అరుదైన ఘనత సాధించాడు. ఒకే టెస్టు మ్యాచ్‌లో రెండు సెంచరీలను చేశాడు. అదేంటి చాలామంది ఇలాంటి ఫీట్‌ చేసి ఉంటారు కదా.. అనే అనుమానం వస్తుంది. కానీ, శ్రీలంక బ్యాటర్‌ కమిందు మెండిస్‌ మాత్రం ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి సెంచరీలను బాదేయడం అసలైన ట్విస్ట్‌. తొలి ఇన్నింగ్స్‌లో మెండిస్‌ 102 పరుగులు చేశాడు. మరొక బ్యాటర్ ధనంజయ డిసిల్వా (102) కూడా శతకం బాదాడు. దీంతో ఆ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 280 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బంగ్లాదేశ్‌ 188 పరుగులకే కుప్పకూలింది. 

ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ శ్రీలంక క్రికెటర్ మెండిస్‌ (164) భారీ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇక్కడ మళ్లీ ధనంజయ డిసిల్వా (108) కూడా శతకం చేయడం మరో విశేషం. కానీ, మెండిస్‌ ఏడో స్థానంలోనే రెండు సెంచరీలు సాధించాడు. ఇలా ఒకే టెస్టులో సెంచరీలు చేసిన మూడో జోడీగా రికార్డు సాధించారు. గ్రెగ్ ఛాపెల్ - ఇయాన్‌ ఛాపెల్‌ (ఆస్ట్రేలియా), మిస్బా ఉల్‌ హక్ - అజ్‌హర్‌ అలీ (పాకిస్థాన్‌) వీరి కంటే ముందున్నారు. మెండిస్ - డిసిల్వా సెంచరీలతోపాటు కరుణరత్నె (52) హాఫ్ సెంచరీ సాధించడంతో శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 418/10 స్కోరు చేసింది. దీంతో బంగ్లాదేశ్‌ ఎదుట 511 పరుగులను లక్ష్యంగా నిర్దేశించింది. ప్రస్తుతం బంగ్లా రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లను కోల్పోయి 47 పరుగులు చేసింది. తొలి టెస్టులో శ్రీలంక విజయం సాధించడం దాదాపు ఖాయమే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు