IND vs PAK: సూపర్‌-4లో భారత్‌, పాక్‌ మ్యాచ్‌.. అభిమానులకు గుడ్‌న్యూస్‌

ఆసియా కప్‌లో సూపర్‌-4 మ్యాచ్‌లు జరిగే కొలంబో (Colombo)లో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తుండటంతో ఫ్యాన్స్‌ ఆందోళన చెందుతున్నారు. అయితే, శ్రీలంక వాతావరణశాఖ అధికారి ఒకరు అభిమానులకు కాస్త ఊరటనిచ్చే విషయాన్ని వెల్లడించారు. 

Updated : 06 Sep 2023 18:29 IST

ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్‌లో గ్రూప్‌ దశలో చిరకాల ప్రత్యర్థులు భారత్‌, పాక్‌ (IND vs PAK) మధ్య మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది. భారత్‌ ఇన్నింగ్స్‌ ముగిసిన తర్వాత జోరుగా వర్షం కురిసింది. చాలాసేపు వేచి చూసినా వర్షం తగ్గకపోవడంతో పాక్‌ బ్యాటింగ్‌కు దిగకుండానే మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో దాయాదుల మధ్య హోరాహోరీ మ్యాచ్‌ను చూద్దామనుకున్న అభిమానులకు నిరాశే ఎదురైంది. సూపర్‌-4లో ఈ ఇరుజట్లు మరోసారి తలపడనుండటంతో మ్యాచ్‌పై ఆసక్తి నెలకొంది. మరోవైపు సూపర్‌-4 మ్యాచ్‌లు జరిగే కొలంబో (Colombo)లో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తుండటంతో ఫ్యాన్స్‌ ఆందోళన చెందుతున్నారు. అయితే, శ్రీలంక వాతావరణశాఖ అధికారి ఒకరు అభిమానులకు కాస్త ఊరటనిచ్చే విషయాన్ని వెల్లడించారు.

తన పేరు ప్రకటించగానే.. రోహిత్ రియాక్షన్‌ ఇదే..

టోర్నీ ముగింపు దశ మ్యాచ్‌లకు పెద్దగా వర్షం ముప్పు పొంచి ఉండదని శ్రీలంక వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ కరుణానాయక్ పేర్కొన్నారు. సెప్టెంబరు 9 తర్వాత కొలంబోలో వాతావరణం పొడిగా ఉంటుందని, ఒక వేళ వర్షం పడినా, చిరుజల్లులే కురిసే అవకాశం ఉందన్నారు. దీంతో సెప్టెంబరు 10న భారత్, పాక్ మధ్య మ్యాచ్‌ సజావుగా జరిగే అవకాశం ఉంది. సెప్టెంబరు నుంచి కొలంబోలో సూపర్‌-4 మ్యాచ్‌లు మొదలుకానున్నాయి. ఫైనల్‌ మ్యాచ్‌ (సెప్టెంబరు 17న) కూడా ఇక్కడే జరగనుంది. సూపర్‌-4లో రోహిత్ సేన పాక్‌తో మ్యాచ్‌ ఆడిన అనంతరం 12న శ్రీలంకను ఢీకొట్టనుంది. సెప్టెంబర్ 15న భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య చివరి సూపర్‌-4 మ్యాచ్‌ జరుగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని