Team India: పాక్‌తో పోలిస్తే.. కొత్తబంతితో భారత్ బౌలింగ్‌ దాడే అద్భుతం: సునీల్ గావస్కర్

ఇంకెప్పుడూ పాక్‌ పేస్‌ బౌలింగ్‌తో భారత్‌ను పోల్చాల్సిన అవసరం లేదని.. కొత్తబంతితో టీమ్‌ఇండియాదే (Team India) అద్భుతమైన ఎటాక్‌ అని క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు.

Updated : 19 Sep 2023 16:35 IST

ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్ ఫైనల్‌లో (Asia Cup 2023 Final) శ్రీలంకను 50 పరుగులకే కుప్పకూల్చడంలో భారత పేస్‌ బౌలర్లు కీలక పాత్ర పోషించారు. పది వికెట్లనూ వారే తీశారు. అందులో మహమ్మద్ సిరాజ్‌ (Siraj) ఆరు వికెట్లు తీయగా.. హార్దిక్ 3, బుమ్రా ఒక వికెట్ పడగొట్టారు. సంచలనమైన బౌలింగ్‌పై క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ (Sunil Gavaskar) ప్రశంసలు కురిపిస్తూనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మొన్నటి వరకు పాకిస్థాన్‌ పేస్ దళం గురించి చెప్పేవారని.. ఇప్పుడు భారత ఫాస్ట్‌ బౌలింగ్‌ అద్భుతంగా మారిందని వ్యాఖ్యానించాడు. 

పాస్‌పోర్ట్‌ మరిచిన రోహిత్‌.. వైరల్‌గా మారిన కోహ్లీ ఒకప్పటి కామెంట్లు!

‘‘గతంలో మనకు ఇలాంటి బౌలింగ్‌ దాడి ఉన్నట్లు నాకైతే గుర్తుకు రావడం లేదు. ఇప్పుడు కొత్త బంతితో నాణ్యమైన బౌలింగ్‌ ఎటాక్‌ను కలిగి ఉన్నాం. క్రికెట్ అభిమానులు ఎక్కువగా  పాక్‌ పేస్ బౌలింగ్‌ గురింంచి మాట్లాడుతూ ఉంటారు. అయితే, బుమ్రా రాకతో భారత (Team India) పేస్ ఎటాక్‌ మరింత పదునెక్కింది. బుమ్రా ఆరంభంలో వికెట్లు తీయకపోయినా.. బ్యాటర్లపై ఒత్తిడి మాత్రం పెట్టగలడు. మనకు షమీ వంటి సీనియర్‌ బౌలర్‌ ఉన్నాడని మాత్రం మరిచిపోవద్దు. తుది జట్టులో ఆడకపోయినా అతడు కీలకమే. దీంతో భారత రిజర్వ్‌ కూడా బలంగా మారింది. ఇప్పటి వరకు ఇదే విభాగంపై ఆందోళనగా ఉండేది. 

ఆసియా కప్‌ ఫైనల్‌లో మహమ్మద్ సిరాజ్‌ ప్రదర్శన అద్భుతం. అతడు అలా వికెట్లు తీస్తూనే.. బౌండరీ లైన్‌కు వెళ్తున్న బంతిని ఛేజ్ చేయడం అందరికీ నవ్వులు తెప్పించింది. సిరాజ్‌లోని ఆ ఎనర్జీ స్థాయి ఎలాంటిదో మనందరికి తెలుసు. ప్రతి బంతికి వికెట్ తీయాలనే లక్ష్యంతో బౌలింగ్‌ చేసిన ప్లేయర్లు చాలా అరుదుగా ఉంటారు. సిరాజ్‌ ఆ కేటగిరీలో ఒకడు’’ అని గావస్కర్ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని