T20 WC 2024: స్కాట్లాండ్‌-ఇంగ్లాండ్‌ మ్యాచ్‌ వర్షార్పణం

స్కాట్లాండ్, ఇంగ్లాండ్‌ మధ్య టీ20 ప్రపంచకప్‌ గ్రూప్‌-బి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది. పది ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. మంగళవారం టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న స్కాట్లాండ్‌ నిర్ణీత 10 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 90 పరుగులు చేసింది.

Published : 05 Jun 2024 03:10 IST

బ్రిడ్జ్‌టౌన్‌: స్కాట్లాండ్, ఇంగ్లాండ్‌ మధ్య టీ20 ప్రపంచకప్‌ గ్రూప్‌-బి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది. పది ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. మంగళవారం టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న స్కాట్లాండ్‌ నిర్ణీత 10 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 90 పరుగులు చేసింది. ఓపెనర్లు జార్జ్‌ మున్సీ (41 నాటౌట్‌; 31 బంతుల్లో 4×4, 2×6), మైకెల్‌ జోన్స్‌ (45 నాటౌట్‌; 30 బంతుల్లో 4×4, 2×6) ధాటిగా ఆడారు. స్కాట్లాండ్‌ 6.2 ఓవర్లలో 51/0తో ఉన్నప్పుడు మ్యాచ్‌కు తొలిసారి వర్షం అంతరాయం కలిగించింది. చాలా సమయం వృథా కావడంతో ఇన్నింగ్స్‌ను పది ఓవర్లకు కుదించారు. అయితే స్కాట్లాండ్‌ ఇన్నింగ్స్‌ పూర్తికాగానే వర్షం మళ్లీ మొదలైంది. తిరిగి ఆట సాధ్యం కాలేదు. ఆట ప్రారంభమై ఉంటే డక్‌వర్త్‌ లూయిస్‌ విధానంలో ఇంగ్లాండ్‌ 109 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సి వచ్చేది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని