T20 World Cup 2024: అఫ్గాన్‌ ధనాధన్‌

టీ20 ప్రపంచకప్‌లో అఫ్గానిస్తాన్‌ శుభారంభం చేసింది. బ్యాటింగ్‌లో రహ్మనుల్లా గుర్బాజ్‌ (76; 45 బంతుల్లో 4×4, 4×6), ఇబ్రహీం జాద్రాన్‌ (70; 46 బంతుల్లో 9×4, 1×6).. బౌలింగ్‌లో ఫజల్‌హక్‌ ఫారూఖీ (5/9) సత్తాచాటడంతో భారీ విజయంతో బోణీ కొట్టింది.

Published : 05 Jun 2024 03:13 IST

గుర్బాజ్, జాద్రాన్‌ మెరుపులు
ఫారూఖీ విజృంభణ
ఉగాండాపై అఫ్గాన్‌ భారీ విజయం

పావిడెన్స్‌ (గయానా): టీ20 ప్రపంచకప్‌లో అఫ్గానిస్తాన్‌ శుభారంభం చేసింది. బ్యాటింగ్‌లో రహ్మనుల్లా గుర్బాజ్‌ (76; 45 బంతుల్లో 4×4, 4×6), ఇబ్రహీం జాద్రాన్‌ (70; 46 బంతుల్లో 9×4, 1×6).. బౌలింగ్‌లో ఫజల్‌హక్‌ ఫారూఖీ (5/9) సత్తాచాటడంతో భారీ విజయంతో బోణీ కొట్టింది. మంగళవారం జరిగిన గ్రూపు-సి మ్యాచ్‌లో అఫ్గాన్‌ 125 పరుగుల ఆధిక్యంతో ఉగాండాను చిత్తుచేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన అఫ్గాన్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 183 పరుగులు సాధించింది. గుర్బాజ్, జాద్రాన్‌ మొదటి వికెట్‌కు 154 పరుగులు జోడించడం విశేషం. ఉగాండా బౌలర్లలో కాస్మస్‌ (2/25), బ్రయాన్‌ మసాబా (2/21), అల్పేష్‌ రంజాని (1/33) సఫలమయ్యారు. అనంతరం లక్ష్య ఛేదనలో ఉగాండా చేతులెత్తేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఫారూఖీ  విజృంభించడంతో ఉగాండా 16 ఓవర్లలో 58 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో నలుగురు డకౌటవగా.. ఇద్దరు మాత్రమే రెండంకెల స్కోర్లు సాధించగలిగారు. ఫారూఖీతో పాటు నవీనుల్‌ హక్‌ (2/4), రషీద్‌ఖాన్‌ (2/12), ముజీబుర్‌ రహమాన్‌ (1/16) సత్తాచాటి జట్టుకు విజయాన్ని అందించారు. ఆల్‌రౌండ్‌ ఆటతో అదరగొట్టిన అఫ్గాన్‌కు రెండు పాయింట్లు లభించాయి.

అఫ్గానిస్తాన్‌ ఇన్నింగ్స్‌: గుర్బాజ్‌ (సి) రియాజత్‌ (బి) అల్పేష్‌ 76; ఇబ్రహీం (బి) మసాబా 70; నజీబుల్లా జాద్రాన్‌ (సి) దినేశ్‌ (బి) మసాబా 2; నబి నాటౌట్‌ 14; గుల్బదిన్‌ నైబ్‌ (సి) మసాబా (బి) కాస్మస్‌ 4; ఒమర్జాయ్‌ (సి) దినేశ్‌ (బి) కాస్మస్‌ 5; రషీద్‌ నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 183; వికెట్ల పతనం: 1-154, 2-156, 3-162, 4-169, 5-181; బౌలింగ్‌: అల్పేష్‌ రంజాని 4-0-33-1; కాస్మస్‌ 4-0-25-2; దినేశ్‌ నక్రాని 3-0-37-0; బిలాల్‌ హసన్‌ 2-0-34-0; హెన్రీ 2-0-19-0; రియాజత్‌ 1-0-11-0; బ్రయాన్‌ మసాబా 4-0-21-2

ఉగాండా ఇన్నింగ్స్‌: రోనక్‌ (బి) ఫారూఖీ 4; సైమన్‌ (సి) ఫరూఖీ (బి) రహమాన్‌ 4; రోజర్‌ ఎల్బీ (బి) ఫారూఖీ  0; రియాజత్‌ (బి) ఫారూఖీ  11; దినేశ్‌ (బి) నవీనుల్‌ 6; అల్పేష్‌ (సి) గుల్బదిన్‌ (బి) నవీనుల్‌ 0; రాబిన్సన్‌ (సి) గుర్బాజ్‌ (బి) ఫారూఖీ  14; మసాబా (సి) గుర్బాజ్‌ (బి) ఫారూఖీ  0; బిలాల్‌ (ఎల్బీ) (బి) రషీద్‌ 8; కాస్మస్‌ నాటౌట్‌ 2; హెన్రీ (బి) రషీద్‌ 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం: (16 ఓవర్లలో ఆలౌట్‌) 58; వికెట్ల పతనం: 1-4, 2-4, 3-8, 4-18, 5-18, 6-47, 7-47, 8-48, 9-58; బౌలింగ్‌: ఫారూఖీ 4-0-9-5; ముజీబుర్‌ రహమాన్‌ 3-0-16-1; నవీనుల్‌ హక్‌ 2-0-4-2; ఒమర్జాయ్‌ 2-0-7-0; రషీద్‌ ఖాన్‌ 4-0-12-2; మహ్మద్‌ నబి 1-0-8-0

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని