T20 World Cup 2024: లంక మళ్లీ ఓడింది

శ్రీలంకకు వరుసగా రెండో ఓటమి. రిషాద్‌ హుస్సేన్‌ (3/22), ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌ (3/17) విజృంభించడంతో టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌ బోణీ కొట్టింది. శనివారం గ్రూప్‌-డి మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది.

Updated : 09 Jun 2024 04:20 IST

బంగ్లా బోణీ

డల్లాస్‌: శ్రీలంకకు వరుసగా రెండో ఓటమి. రిషాద్‌ హుస్సేన్‌ (3/22), ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌ (3/17) విజృంభించడంతో టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌ బోణీ కొట్టింది. శనివారం గ్రూప్‌-డి మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది. స్వల్ప స్కోర్లు నమోదైన ఈ పోరులో మొదట లంక 124/9కే పరిమితమైంది. నిశాంక (47; 28 బంతుల్లో 7×4, 1×6) టాప్‌ స్కోరర్‌. ఛేదనలో నువాన్‌ తుషార (4/18), హసరంగ (2/32) దెబ్బకు బంగ్లా తడబడినా.. 19 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి గట్టెక్కింది. తౌహిద్‌ హృదోయ్‌ (40; 20 బంతుల్లో 1×4, 4×6), లిటన్‌దాస్‌ (36; 38 బంతుల్లో 2×4, 1×6) బంగ్లాను విజయతీరాలకు చేర్చారు. రిషాద్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.

శ్రీలంక: 124/9 (నిశాంక 47, ధనంజయ డిసిల్వా 21, అసలంక 19; రిషాద్‌ హుస్సేన్‌ 3/22, ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌ 3/17, తస్కిన్‌ అహ్మద్‌ 2/25) బంగ్లాదేశ్‌: 19 ఓవర్లలో 125/8 (తౌహిద్‌ హృదోయ్‌ 40, లిటన్‌దాస్‌ 36; తుషార 4/18, హసరంగ 2/32)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని