IND vs IRE- T20 world cup 2024: టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ శుభారంభం.. ఐర్లాండ్‌పై ఘన విజయం..

టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

Updated : 05 Jun 2024 23:18 IST

న్యూ యార్క్‌: టీ20 ప్రపంచకప్‌ 2024 (T20 World Cup)లో భారత్ శుభారంభం చేసింది. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టీమ్ఇండియా (Team India) పేసర్ల ధాటికి ఐరిష్‌ జట్టు 16 ఓవర్లలో 96 పరుగులకే ఆలౌటైంది. ఈ స్వల్ప లక్ష్యాన్ని భారత్ 12.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. విరాట్ కోహ్లీ (1) విఫలమైనా.. కెప్టెన్ రోహిత్ శర్మ (52; 37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ శతకం బాది రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. రిషభ్‌ పంత్ (36*; 26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. ఐర్లాండ్ బౌలర్లలో అడైర్, బెంజిమన్ వైట్ తలో వికెట్ పడగొట్టారు. 

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్‌కు ఆరంభం నుంచే వరుస షాక్‌లు తగిలాయి. బాల్‌బిర్నీ (5), పాల్ స్టిర్లింగ్ (2), టక్కర్ (10), టెక్టార్ (4), క్యాంఫర్ (12), డాక్రెల్ (3), అడైర్ (3), మెకార్తీ (0) వరుసగా పెవిలియన్‌ బాటపట్టారు. దీంతో 50 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయిన ఆ జట్టు.. 60 రన్స్‌లోపే ఆలౌటయ్యేలా కనిపించింది. ఈ దశలో డెలానీ (26; 14 బంతుల్లో), జోష్ లిటిల్ (14; 13 బంతుల్లో 2 ఫోర్లు) దూకుడుగా ఆడటంతో ఐర్లాండ్ ఆ మాత్రం స్కోరైనా చేసింది. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్య (3/27), బుమ్రా (2/6), అర్ష్‌దీప్ (2/35) అదరగొట్టారు. సిరాజ్, అక్షర్ పటేల్ తలో వికెట్ తీశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని