T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌.. తడబడినా.. దక్షిణాఫ్రికాదే గెలుపు

టీ20 ప్రపంచకప్‌ 2024లో గ్రూప్‌ డిలో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 4 వికెట్ల తేడాతో గెలిచింది.

Updated : 09 Jun 2024 02:19 IST

న్యూ యార్క్‌: టీ20 ప్రపంచకప్‌ 2024లో దక్షిణాఫ్రికా వరుసగా రెండో విజయం సాధించింది. గ్రూప్‌ డిలో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో గెలిచింది. 104 పరుగుల టార్గెట్‌ని 18.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. లక్ష్యం చిన్నదే అయినా ఆరంభంలో దక్షిణాఫ్రికా తడబడింది. రిజా హెండ్రిక్స్‌ (3), క్వింటన్ డికాక్‌ (0), మార్‌క్రమ్ (0), హెన్రిచ్‌ క్లాసెన్ (4) వరుసగా పెవిలియన్ చేరారు. దీంతో 12 పరుగులకే సఫారీ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయింది. వన్డే ప్రపంచకప్‌లో మాదిరిగా నెదర్లాండ్స్ సఫారీలకు మరో షాక్‌ ఇస్తుందా? అనే ఆసక్తి నెలకొంది. ఈ దశలో ట్రిస్టన్ స్టబ్స్‌ (33; 37 బంతుల్లో), డేవిడ్ మిల్లర్ (59*; 51 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఆదుకుని జట్టుకు విజయాన్ని అందించారు. నెదర్లాండ్స్‌ బౌలర్లలో వివియన్ కింగ్మా 2, వాన్‌ బిక్ 2, బాస్ డి లీడే ఒక వికెట్ తీశారు.

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 103 పరుగులే చేసింది. సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ (40) మాత్రమే రాణించాడు. వాన్ బిక్‌ (23) ఫర్వాలేదనిపించాడు. విక్రమ్‌జిత్ సింగ్ (12), ఎడ్వర్డ్స్‌ (10) పరుగులు చేయగా.. మిగతా బ్యాటర్లు సింగిల్‌ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఒట్నీల్ బార్ట్‌మాన్ (4/11) అదరగొట్టాడు. మార్కో జాన్సన్, నోకియా తలో రెండు వికెట్లు పడగొట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని