IND Vs BAN : తీవ్ర ఒత్తిడిలోనూ అత్యుత్తమ ప్రదర్శన వారిది.. అశ్విన్‌, శ్రేయస్‌లపై ప్రశంసల జల్లు

బంగ్లాతో రెండో టెస్టులో అశ్విన్‌,శ్రేయస్‌ అయ్యర్‌ల ప్రదర్శన అద్భుతం. వీరిద్దరి కీలక భాగస్వామ్యం జట్టుకు అపురూపమైన విజయాన్ని అందించింది.

Updated : 29 Jun 2023 15:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ :  బంగ్లాతో రెండో టెస్టులో పీకల్లోతు కష్టాల్లో పడ్డ టీమ్‌ఇండియాను కీలక ఇన్నింగ్స్‌తో ఆదుకున్నారు అశ్విన్ (42*)‌ - శ్రేయశ్‌ (29*) ద్వయం. స్వల్ప లక్ష్య ఛేదనలో.. బంగ్లా బౌలర్ల ధాటికి బెంబేలెత్తిన భారత్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్ది వీరిద్దరూ జట్టుకు విజయాన్నందించారు. 8వ వికెట్‌కు 71 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేసి జట్టుకు అపురూపమైన గెలుపును అందించిన వీరిపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. సామాజిక మాధ్యమాల్లో వీరి ఆటతీరును మెచ్చుకుంటూ పలువురు పోస్టులు పెట్టారు.

 

సైంటిస్ట్‌ (అశ్విన్‌) పూర్తి చేశాడు. అశ్విన్‌ నుంచి అద్భుతమైన ఇన్నింగ్స్‌. శ్రేయస్ అయ్యర్‌తో కలిసి సూపర్ భాగస్వామ్యంతో జట్టును గెలిపించాడు. 

- వీరేంద్ర సెహ్వాగ్‌


సిరీస్‌ గెల్చుకున్నందుకు టీమ్ఇండియాకు అభినందనలు. బంగ్లాదేశ్‌ స్పిన్నర్లు భారత్‌పై ఒత్తిడి తెచ్చారు. కానీ, రవిచంద్రన్‌ అశ్విన్‌, శ్రేయస్‌ అయ్యర్‌ అద్భుతంగా ఆడి టీమ్‌ఇండియాకు విక్టరీని అందించారు                                                                                                  

  - సచిన్‌ తెందూల్కర్‌ 


‘తీవ్ర ఒత్తిడిలో అశ్విన్‌, శ్రేయస్‌లది అత్యుత్తమ ప్రదర్శన. మంచి క్లాస్‌ ఆట. వెల్‌డన్‌ టీమ్‌ఇండియా. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ టోర్నీ ఫైనల్‌ వైపు మరో అడుగు ముందుకు’

- దినేశ్‌ కార్తిక్‌


‘వాట్‌ ఏ టెస్టు మ్యాచ్‌.. అద్భుతం. ఈ ఫార్మాట్‌కు ఈ విజయం గొప్ప ప్రచారాన్ని కల్పించింది’

-బ్రాడ్‌ హగ్‌, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌


‘అత్యంత కీలకమైన విజయ భాగస్వామ్యం వారిది. శ్రేయస్‌, అశ్విన్‌లకు అభినందనలు. అయితే బంగ్లా ఆటగాళ్లకూ క్రెడిట్‌ ఇవ్వాల్సిందే. 145 స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించినా.. 350+ అన్నట్లు వారు పోరాడారు’

- మునాఫ్‌ పటేల్

రెండో టెస్టులో మూడు వికెట్ల తేడాతో విజయం సాధించిన టీమ్‌ఇండియా.. బంగ్లాతో టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని