TeamIndia: అతడిని తీసుకోకపోతే.. ప్రపంచకప్‌లో అవే తప్పులు పునరావృతం: మాజీ క్రికెటర్‌

యశస్వి జైస్వాల్‌(Yashasvi Jaiswal)ను టీ20 ప్రపంచకప్‌ జట్టులోకి తీసుకోవాలని మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా సూచించాడు.

Published : 16 Jan 2024 19:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : టీ20 ప్రపంచకప్‌(T20 world cup 2024) ముందు అఫ్గానిస్థాన్‌తో ఆడుతున్న ఏకైక సిరీస్‌ను టీమ్‌ఇండియా(Team India) కైవసం చేసుకుంది. ఈ ఉత్సాహంతో జూన్‌లో జరగనున్న పొట్టి ప్రపంచకప్‌లో మంచి ప్రదర్శన చేయాలని అభిమానులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో జట్టు కూర్పుపై మాజీ ఆటగాడు ఆకాశ్‌ చోప్రా(Aakash Chopra) స్పందించాడు.

అఫ్గాన్‌తో రెండో టీ20లో 68 పరుగులతో ఆకట్టుకున్న ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ను ప్రస్తుతం జట్టు నుంచి పక్కనపెట్టలేరని.. అతడిని టీ20 ప్రపంచకప్‌లోనూ తీసుకోవాలని ఆకాశ్‌  సూచించాడు. ‘‘యశస్వి తన బ్యాటింగ్‌ తీరుతో ఆకట్టుకుంటున్నాడు. అతడిని సెలెక్ట్‌ చేయకపోతే.. అది సరైన నిర్ణయం అనిపించుకోదు. కొన్ని సార్లు కొందరిని పక్కనపెట్టలేం. అంటే.. వారు సెలక్షన్‌కు అర్హులని అర్థం. అందుకే అతడు పరుగులు చేస్తూ ఇక్కడ ఉన్నాడు. గిల్‌ను అధిగమించాడు’’ అని చెప్పాడు.

యువీ, కోహ్లీ తర్వాత ఆ ఘనత సాధించింది దూబెనే..

పొట్టి ప్రపంచకప్‌నకు జైస్వాల్‌ను ఎంపిక చేయకపోతే.. టీమ్‌ఇండియా పాత తప్పులను పునరావృతం చేసే అవకాశం ఉందని హెచ్చరించాడు. ‘జైస్వాల్‌ను ఎంపిక చేయకపోతే.. ఈ ఫార్మాట్‌లో నెమ్మదిగా ఇన్నింగ్స్‌ ప్రారంభించే అవకాశం ఉంది. 2022 ప్రపంచకప్‌ మాదిరిగానే ఆట తీరు ఉంటుంది.. ఇయర్‌ మాత్రమే మారుతుంది’ అని పేర్కొన్నాడు.

జైస్వాల్‌ ఇప్పటి వరకూ 16 టీ20లు ఆడి.. 498 పరుగులు చేశాడు. అతడి స్ట్రైక్‌రేట్‌ 163. ఇందులో ఒక శతకం.. నాలుగు అర్ధ శతకాలు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు